హీరో నాని (Nani) ఫ్యాన్స్‌తో పాటు ఇటు ఫిల్మ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ‘దసరా’ చిత్రం విడుదలైంది. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odhela) డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సాంగ్స్ అండ్ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ ఒచ్చింది. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ (Sudhakar Cherukuri) నిర్మించారు. అయితే ఇప్పటికే ఓవర్సీస్తో పాటు కొన్నికోట్ల ఫస్ట్ డే షో పడిపోయింది. ఫస్ట్ డే షో చూసినవాళ్లు వాళ్ల అభిప్రాయాన్ని సోషల్ మీడియాతో షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాపై ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందో మీరే చూడండి.. మీరు చదివే రివ్యూకి ‘ఈహా వెబ్ సైట్’ బాధ్యత వహించదు.

‘దసరా’ చిత్రానికి ట్విటర్లో పాజిటివ్ రెస్పాన్స్‌యే వస్తోంది. ‘అంటే సుందరానికి’ మూవీ తర్వాత వచ్చిన నానికి ఇది తన కెరీర్లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) మ్యూజిక్ అదరగొట్టేశాడట. ఇటు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్లే మీద ట్విటర్ వేదికగా మంచి మార్కులే ఇస్తున్నారు. నాని అన్న మాస్ బ్యాటింగ్ మామూలుగా లేదని.. 100 కోట్ల రూపాయలు లోడింగ్ అంటూ ఓ నెటిజన్ Shiva Yadav @ShivaKumar0110 చిన్న వీడియో పోస్ట్ చేశారు.
ఇక మరోనెటిజన్ ఏమన్నారంటే ఈ పదేళ్లలోనే ఇది బెస్ట్ మూవీ అని.. డైరెక్టర్లో మంచి స్టఫ్ ఉందని.. కాకపోతే సినిమా కాస్త స్లోగా ఉందని.. నాని (Nani), కీర్తి సురేష్ (Keerthy Suresh) యాక్టింగ్ బెస్ట్ అవ్వడంతోపాటు ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ మూవీ అంటూ మరో నెటిజన్ Venkat Kondeti @venkatpazzo ట్వీట్ చేశారు.
ఇక నైన్టీస్లో వీర్లపల్లి అనే చిన్నపల్లెటూరులో ముగ్గురు చిన్ననాటి స్నేహితులు ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్) సూరి (దీక్షిత్ శెట్టి)ల మధ్య జరిగే కథే ఈ సినిమా అంటున్నారు నెటిజన్లతోపాటు ఇటు ఆడియన్స్.
ఫస్టాఫ్ కాస్త సాగదీసినట్టు ఉందని.. కాని తన యాక్టింగ్ స్టైల్లో నడిపించాడని.. కొన్ని సీన్లయితే గూస్ బంప్స్ ఒస్తాయని.. సినిమాకు మ్యూజిక్ బాగా సెట్ అయిందని అంటున్నాడు మరో నెటిజన్ Film Buff🍿🎬 @SsmbWorshipper.
ఓవరాల్‌గా ‘దసరా’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో హీరోహీరోయిన్లు పోటీపడి మరి నటించినట్టు కనిపిస్తుంది. సినిమా నిర్మాణ విలువలు కూడా బావున్నాయంటున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odhela) ఆయన గురువైన డైరెక్టర్ సుకుమార్ (Sukumar) మార్క్ కనిపించేలా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. మూవీ రిలీజైన మొదటిరోజే ఇంత మంచి రెస్పాన్స్ తెచ్చుకుందంటే.. ముందు ముందు ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.