✕
Nani Dasara Trailer : యూ ట్యూబ్‌లో దుమ్ము లేపుతున్న నాని ‘దసరా’ ట్రైలర్
By EhatvPublished on 15 March 2023 2:47 AM GMT
నాచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత నెక్ట్స్ చేసే మూవీస్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. దసరా సినిమాను మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేశారు నాని. ఈ మూవీని డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డెరెక్ట్ చేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సాంగ్స్ అండ్ టీజర్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది ‘దసరా’ మూవీ.

x
Thumbnail
-
- నాచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత నెక్ట్స్ చేసే మూవీస్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. దసరా సినిమాను మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేశారు నాని. ఈ మూవీని డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డెరెక్ట్ చేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సాంగ్స్ అండ్ టీజర్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది ‘దసరా’ మూవీ.
-
- ఈ మూవీ మార్చి 30న విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. విడుదలైన క్షణాల్లోనే ఫుల్ పాజిటివ్‌తోపాటు మాంచి బజ్ ఇచ్చింది. ఈ ట్రైలర్ ఓపెనింగ్‌లోనే ‘చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ’ అనే సాంగ్‌తో ఇంకాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మాస్ అండ్ రా ఎలిమెంట్స్‌తో అటు మూవీ లవర్స్‌కి ఇటు నాని ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తోంది.
-
- మాస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే 60 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అవుతుండగా.. హిందీలో రిలీజైన ట్రైలర్‌కి కూడా ఇప్పుడు మంచి రెస్పాన్స్ ఒచ్చింది. దీంతో నాని సినిమాకు బాలీవుడ్‌లోకి కూడా ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
-
- అయితే ఈ మూవీలో నాని ధరణి క్యారెక్టర్ చేస్తుండగా.. హీరోయిన్ కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది. సినిమా మొత్తం సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో రన్ అవుతోంది. ఈ మూవీలో ‘‘తాగి మర్సిపోవుడు తప్పుకాదు.. తప్పు జేసి మర్సిపోవుడు తప్పు అంటూ’’ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో చెప్పిన డైలాగ్‌తో ఇంపాక్ట్ చూపించింది. దాంతోపాటు కొన్ని సీన్స్‌లో కీర్తి సురేష్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌లో హోప్స్ పెంచేసింది ట్రైలర్.
-
- ట్రైలర్లో మనకు మూడు అంశాలు కీలకంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రేమ, ప్రతీకారం, స్నేహం మీద హైలైట్ అవుతున్నాయి. ఈ మూడు లేయర్స్ మీద డైరెక్టర్ స్టొరీ, అండ్ స్క్రీన్ ప్లే రన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అవగా.. తాజాగా ‘చమ్కీల అంగీలేసి’ సాంగ్ ట్రెండింగ్‌లో నడుస్తోంది. తెలంగాణ యాస, భాషలతో ఉన్న ఈ సాంగ్‌కు లిరిక్స్ కాసర్ల శ్యామ్ రాయగా, సింగర్స్ రామ్ మిరియాల, థీ పాడారు.
-
- ఈ మూవీకి పాజిటివ్ బజ్ రావడంతో యూఎస్‌లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 600పైగా ప్రాంతాల్లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో నాని కెరీర్ లో ‘దసరా’ 2 మిలియన్ డాలర్ల మూవీగా నిలవనుందట. ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా ఓ రేంజ్లో బిజినెస్ చేస్తోందట ‘దసరా’ మూవీ. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 40 కోట్ల రేంజ్ బిజినెస్ జరిగే ఉంటుందంటున్నారు సినీ వర్గాలు
-
- ఇక ఈ మూవీపై ఎస్ఎస్ రాజమౌళి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ కూడా చేశారు. ఈ సినిమా కోసం నాని మేకోవర్ అదిరిందని.. డెబ్యూ డైరెక్టర్ ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం బాగుందన్నారు. డైరెక్టర్ కి ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ అంటూ కూడా ట్వీట్ చేశారు ఆయన. ఇక ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం ప్లస్ పాయింట్‌గా మారింది.
-
- ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి చేస్తున్నారు. ఇతర పాత్రల్లో సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్ కనిపించనున్నారు. ఈ మూవీ ఒకేసారి తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 30న విడుదలకానుంది.

Ehatv
Next Story