నాచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత వస్తున్న సినిమా ‘దసరా’. ఈ మూవీని డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డెరెక్ట్ చేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే సాంగ్స్ అండ్ టీజర్స్‏తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది ‘దసరా’ చిత్రం.
ఈ మూవీ మార్చి 30న విడుదలకు సిద్దమయింది.

నాచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత వస్తున్న సినిమా ‘దసరా’. ఈ మూవీని డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డెరెక్ట్ చేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే సాంగ్స్ అండ్ టీజర్స్‏తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది ‘దసరా’ చిత్రం.
ఈ మూవీ మార్చి 30న విడుదలకు సిద్దమయింది.

అయితే ఇప్పుడు ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఇన్‏సైడ్ టాక్స్ ప్రకారం రన్ టైమ్ టాక్ ఒచ్చేసి 2 గంటల 16 నిమిషాల వరకు ఉంటుందన్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. మాస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్‏తో తెరకెక్కిన మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటు సాంగ్స్‏కు అన్ని చోట్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

హీరో నాని అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్‏లో కనిపించడంతో సినీ ప్రియులు మూవీ చూసేందుకు చాలా ఎగ్జైట్‏గా ఉన్నారు. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది. ‘దసరా’ చిత్రంలో నాని ధరణి క్యారెక్టర్ చేస్తుండగా.. హీరోయిన్ కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది. ట్రైలర్‏లో మనకు మూడు అంశాలు కీలకంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రేమ, ప్రతీకారం, స్నేహం మీద హైలైట్ అవుతున్నాయి. ఈ మూడు లేయర్స్ మీద డైరెక్టర్ స్టొరీ, అండ్ స్క్రీన్ ప్లే రన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నాని, కీర్తిసురేష్ నటిస్తున్నారు. సాయికుమార్, షైన్ టామ్ చాకో, సముద్రఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Updated On 16 March 2023 3:22 AM GMT
Ehatv

Ehatv

Next Story