✕
Nani Dasara First Day Collections : దసరా ఓ ధీటైన జవాబు....నాని ఛాలెంజ్ నిజమే...ఆ ముగ్గురికీ హేట్సాఫ్.!
By EhatvPublished on 31 March 2023 8:09 AM GMT
సినిమా ప్రారంభమైన క్షణం నుంచి ఎవ్వడికీ నోట మాట లేదు. ఒక్కొక్క షాట్ పాస్ అవుతుంటే ఆడియన్స్ తమమీద తాము గ్రిప్ కోల్పోయి పూర్తిగా సినిమాలో కూరుకుపోయారు. పిన్‌డ్రాప్ సైలెన్స్ హాలంతా. తెరమీద శబ్దం తప్పితే కిక్కురుమనకుండా చూడ్డం మొదలు పెట్టారు జనం. ఒంటి మీద స్పృహ వచ్చినప్పుడు పొలోమని చప్పట్లు, కేకలు, ఈలలు ధియేటర్‌ని అల్లలాడించాయి. దీనంతటికీ కారణం, కథ నడిచే మెస్మరైజింగ్ విధానం. కథనంలో టైట్ గ్రిప్. దర్శకుడు శ్రీకాంత్ ఆడియన్స్‌ని తేరుకోనివ్వలేదు. దెబ్బ మీద దెబ్బలా..సీన్ మీద సీన్ రన్ అవుతుంటే, ఆ కథ జరిగే గ్రామంలో జనంలో ధియేటర్లో జనం కూడా కలసిపోయి, తోవ తప్పిపోయారు.

x
Nani Dasara Fiesr Day Collections with 38 crores in highest record
-
- దెబ్బకి దెయ్యం పరిగెడుతుందంటారు. దసరా దెబ్బకి నాని మీదున్న విమర్శల దెయ్యం ఆచూకి లేకుండా ఎగిరిపోయింది. నానికి ఓ పవర్ఫుల్ హీరోగా ఎంత గొప్ప ఇమేజ్ ఉందో ఆ రేంజ్లో అంత పెద్ద హిట్ పడకపోవడం విమర్శకులకు చాలా అవకాశమివ్వడమే కాకుండా, నాని అభిమానులకు అంత నిరాశ కూడా కలిగించింది. ఇప్పుడీ రెండిటికీ కూడా దసరా సీరియస్‌గా చెక్ పెట్టింది. నాని అనే హీరోని సూపర్ హైట్స్ మీద కూర్చోబెట్టింది.
-
- కొత్తగా మైక్రోఫోన్ పట్టుకున్న శ్రీకాంత్ ఓదెల రాసిన కథని మూడు గంటలు విని, మూడేళ్ళు వర్కవుట్ చేసి చివరికి నిర్మాణాత్మకంగా నిర్మాణానికి పూనుకున్నారు హీరో నాని ప్లస్ నిర్మాత చెరుకూరి సుధాకర్. సినిమా ఇక్కడ ప్రసాద్ ఐ మాక్స్‌లో మీడియాకి, పబ్లిక్‌తో పాటు ప్రదర్శించారు. సినిమా ప్రారంభమైన క్షణం నుంచి ఎవ్వడికీ నోట మాట లేదు. ఒక్కొక్క షాట్ పాస్ అవుతుంటే ఆడియన్స్ తమమీద తాము గ్రిప్ కోల్పోయి పూర్తిగా సినిమాలో కూరుకుపోయారు. పిన్‌డ్రాప్ సైలెన్స్ హాలంతా. తెరమీద శబ్దం తప్పితే కిక్కురుమనకుండా చూడ్డం మొదలు పెట్టారు జనం. ఒంటి మీద స్పృహ వచ్చినప్పుడు పొలోమని చప్పట్లు, కేకలు, ఈలలు ధియేటర్‌ని అల్లలాడించాయి. దీనంతటికీ కారణం, కథ నడిచే మెస్మరైజింగ్ విధానం. కథనంలో టైట్ గ్రిప్. దర్శకుడు శ్రీకాంత్ ఆడియన్స్‌ని తేరుకోనివ్వలేదు. దెబ్బ మీద దెబ్బలా..సీన్ మీద సీన్ రన్ అవుతుంటే, ఆ కథ జరిగే గ్రామంలో జనంలో ధియేటర్లో జనం కూడా కలసిపోయి, తోవ తప్పిపోయారు. అదీ సినమా అంటే. అదీ స్క్రీన్‌ప్లే అంటే. అసలు ముందు నాని క్వార్టర్ బాటిల్‌తో ఎంట్రీ ఇవ్వగానే....నమ్మలేని ఓ దృశ్యం.
-
- అసలే నేచురల్ స్టార్...దానికి తోడు ధరణి పాత్రలో లీనమైపోయిన నాని ప్రతీ లుక్కూ నాని స్థాయిని అమాంతం పెంచి పారేసింది. బెట్టు కట్టొచ్చు....ఎవరైనా మరీ ఇంత నలిగిపోయి కనిపించి మరీ పాత్రలో జీవించగలిగితే డబుల్ ది రెమ్యూనరేషన్ ఇవ్వొచ్చు. నాని పూర్తిగా ధరణి పాత్రని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాడని అర్ధమైపోతుంది. ప్రెస్మీట్లలో నాని...రేపు చూస్కోండ్రా...నేనిప్పుడేం మాట్టాడను...అన్నట్టుగా స్వాతిశయం ఎందుకు చూపించాడో సినిమా చూస్తేనే గానీ అర్ధం కాదు. మనవాళ్ళకి సినిమా తీయడం రాదు అని వాపోయే కుహనా మేథావులకు...దసరా చిత్రం...అందులో నాని హై ఓల్టేజ్ పెరఫారమెన్స్‌ని చూస్తే గానీ నోళ్ళు మూతపడవు. నొసలు వెక్కిరించడం మానవు. పరభాషా చిత్రాలను మెచ్చుకోవడంలో అలసిసొలసి పోయే ప్రబుద్దులకు బాహుబలి మొదటి గుణపాఠం నేర్పింది. త్రిబుల్ ఆర్ వాతలు పెట్టింది. తప్పని సరిగా దసరా చిత్రం కూడా తెలుగు వారి ప్రతిభకు, సృజనాత్మక వైభవానికి ఆ రెండు చిత్రాల వరసన, సరసన స్థానం గెలుచుకుని తీరుతుంది. విమర్శల కోసమే పుట్టబడిన కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కూడా ఈసారి పూర్తిగా పాదాక్రాంతమైపోవడమే విశేషం, నేషనల్ లెవెల్‌తో పాటుగా. ధరణి, ధరణి ప్రెండు, వెన్నెల పాత్రలను ఎంత పొయిటిక్గా ట్రీట్ చేశాడో దర్శకుడు శ్రీకాంత్ ఉత్తుత్తి మాటలలో చెప్పలేం. అంత rustic atmosphereలో కూడా కథనంలో Poetic treatmentని మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడే....దర్శకుడు శ్రీకాంత్‌కి హేట్సాఫ్. ఊర్లో స్త్రీల నిస్పహాయత, మగాళ్ళ తాగుడు వ్యసనం, ఎంతో కొంత గ్రామకక్షలు వీటన్నిటి మధ్య ఈ ట్రయాంగిల్ కవితాత్మక కథనవిధానాన్ని అందించిన శ్రీకాంత్ deserves a big round of applause.
-
- ధరణి స్నేహితుడు హత్యకు గురైన ఇంటర్వెల్ ఎపిసోడ్ రోమాంచితం. ఎప్పుడో శివ చిత్రంలో తొలిసారి రామ్ గోపాల్ వర్మ అటువంటి ఎక్సైట్మెంట్ గుచ్చిగుచ్చి చొప్పించాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకు శ్రీకాంత్ మరింత ధీటుగా చూపించి ఘటికుడు అనిపించుకున్నాడు. ఇవే మాటలు నాలుగు పొడి మాటలతో, సూపర్, హైపర్, అదుర్స్ అనే చౌకబారు విశేషణాలతో కూడా ఈ సమీక్షని ముగించొచ్చు. అది దసరా దర్శకనిర్మాతలు, నాని చేసిన తపస్పుకి చంద్రుడికో నూలు పోగంత కూడా కాదు. ధరణి స్నేహితుడు హత్యకు గురైన తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తిని శ్రీకాంత్ ఎంతో అందంగా, మానవీయ కోణంలో, నిజమైన స్నేహానికి నజరానాగా తీర్చిదిద్దాడు. ముండ మోస్తున్న వెన్నెలకి ఆ క్షణమే ఆమె మెడలోనుంచి, జరుగుతున్న తంతులో భాగంగా తీసేస్తున్న తాళిని ధరణి పాత్ర చాలా ఎమోషనల్‌గా కట్టినప్పడు, వెన్నెలని ఎవడో గ్రామనీచుడు అపహాస్యం చేసినప్పడు, ధరణి పాత్ర వాడిని చితక్కొట్టినప్పుడు ఆడియన్స్ ఎమోషన్స్ ఎంత కూల్ అయ్యాయో....wonderful moments on screen and in theatres. ముఖ్యంగా వెన్నెలని ధరణిని పెళ్ళాడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యనా చిన్ననాటి అమాయకపు చెలిమినే కొనసాగించమే దసరా సినిమాకి గొప్ప అమూల్యతను, పవిత్రతను ఆపాదించింది.
-
- నిజానికి ఇటువంటి మాస్ కమర్షియల్ చిత్రంలో మళ్ళీ పెళ్ళయిన ఓ మెయిన్ హీరోకి, హీరోయిన్‌కి మధ్యన ఓ పాటతో, ఓ శృంగార సన్నివేశాన్ని ప్రజెంట్ చేస్తారు. అది కేవలం కమర్షియల్‌గా మాస్‌ని రెచ్చగొట్టి, మార్కులు కొట్టెద్దామనే దురాశ. స్వాతిముత్యం సినిమాలో కళాతపస్వి అనిపించుకున్న కె. విశ్వనాథాగారు కూడా అంతటి Poignant Film స్వాతిముత్యంలో కూడా అటువంటి సీన్లను తప్పించుకోలేకపోయారు. వందలూ, వేలూ నవలలు రాసిన మహానవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణిగారు కూడా తన అభిశాపం నవలలో ఆ సీన్‌ని వర్ణించకుండా ఉండలేకపోయింది. కానీ, దసరా చిత్రంలో శ్రీకాంత్ వాటిని తప్పించాడు. నాని కూడా కోరుకుని ఉండడు. అదీ దసరా గ్రేట్‌నెస్. కేవలం చివరి వరకూ కూడా ధరణిని, వెన్నెలని ఎంతో పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చింది దసరా చిత్రం. మరోసారి హేట్సాఫ్. వెన్నెల, ధరణి ఒకరినొకరు కౌగిలించుకుని, హత్తుకోవడానికి ఎంత నిడివిని పెట్టుకున్నారంటే అదీ మేకింగ్‌లో ఇంటిగ్రెటీ. ధరణి అంటే భూధేవి. అపరిమితమైన సహనానికి భూదేవిని చెప్తారు. దసరా చిత్రంలో నాని పాత్ర ధరణి కూడా అంతే. విలన్ అరాచానికి అంతూ పొంతూ లేకుండా పోయినప్పుడు, వెన్నలని చెరబట్టాలనే వాడి పరాకాష్టను వాడి భార్య చేతే చెప్పించి, తన స్నేహితుడు వాడి పన్నాగానికే బలైపోయాడని ధరణికి తెల్సినప్పుడు, ధరణి ఆ ఘోరాన్ని తట్టుకోలేకపోయినప్పుడు....ఒక్క క్షణం. ప్రకృతి పరంగా అంతటి సహనశీలి భూదేవే భరించలేని అన్యాయం పెరిగిపోయినప్పుడు భూగర్భం ఉడికెత్తిపోతుంది. శెగలు కక్కుతుంది. నిప్పులు చిమ్ముతుంది. కంపించి, కంపించి భూఖండం బద్దలైపోతుంది. అదే ధరణి పాత్రలో మనకి కనిపిస్తుంది.
-
- ధరణి పాత్రలో నాని ఆస్కార్ స్థాయిలో చేసి చూపించాడు. సహజంగానే ధరణి పాత్రలో భూకంపం వస్తుంది. అది క్లైమాక్సును తారాస్థాయికి తీసుకెళ్ఙంది. అంతిమంగా ఆ క్లైమాక్సుతో ధియేటర్ దద్దరిల్లిపోయింది. దర్శకుడు ఎంత ఒప్పించాడో. హీరోగా నాని ఎంత ఒప్పందం పడ్డాడో....ఆ సమీకరణకు చివరంటూ లేదు. వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ కేవలం రియాక్షన్ క్యారెక్టర్. మహానటి చిత్రంలాగా యాక్షన్ రోల్ కాదు. ఈ షో అంతా ఇద్దరిదే. ధర్శకుడు శ్రీకాంత్‌ది, హీరో నానిది. మూడో వ్యక్తి, తెరమీద కనపడని ఓ అద్భుతం....చిత్రనిర్మాత చెరుకూరి సుధాకర్. ఆయనే లేకుంటే ఇలాంటి కళాఖండం తప్పనిసరిగా రంగులు పూసుకునేది కాదు. యువ దర్శకరచయితలు చెప్పింది నిర్మాతలకు అర్ధం కాకపోవడం వల్ల, రిస్క్ చేయలేని దుస్థితి వల్ల ఎందరు పరిశ్రమ కాళ్ళ కింద నలిగిపోతున్నారో లెక్కేలేదు.
-
- వ్యాపారమే కావాలనుకుంటే చెరుకూరి సుధాకర్ దసరా సినిమా డెఫినెట్‌గా తీయాల్సిన అవసరం లేదు. వందాపది వ్యాపారాలున్నాయి డబ్బు సంపాదనకి. కానీ ఆయనలోని కళాత్మక దప్పిక, నిర్మాణాత్మకమైన ఓపిక, సహజసిద్ధమైన జీవిక....దసరా చిత్రానికి పూర్తిగా బాధ్యత వహించాయి. ఆయనకి పరిశ్రమ యావత్తూ సంయుక్తంగా, ముక్తకంఠంతో సన్మానపూర్వకమైన అభినందనలు తెలయజేయాల్సిన మహత్తర చిత్రాన్ని నిర్మించారు చెరుకూరి సుధాకర్. ఫలితమే....మొదటి రోజే 38 కోట్ల వసూళ్ళ వర్షం. ట్రేడ్ అదిరిపడ్డ రిపోర్టు. మెగాస్టార్ చిరంజీవి సాధించిన ఇటీవలి సంచలనాత్మక విజయం వాల్టేర్ వీరయ్య చిత్రంతో సరిసమానంగా తొలి రోజు వసూళ్ళున్నాయంటే ఏంటా హిట్...నిజంగానే ధరణి ఉడికెత్తింది. బాక్సాఫీసులో భూకంపం వచ్చింది. శ్రీకాంత్, నాని, చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా సాధించిన ఈ ఘనవిజయం వారికి గర్వకారణమైతే...ఎందరో క్యూలో కథలు పట్టుకుని నిలబడి నిలబడి, కాళ్ళు పడిపోయిన యువదర్శకులకు దసరా ఓ అమృతసంజీవని. దసరా ఓ చరిత్ర.

Ehatv
Next Story