మాస్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రాబోతున్న ‘దసరా’ కానుకగా హీరో నాని అందరినీ అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా రేంజ్‏లో 2023 మార్చి 30న ఐదు భాషల్లో రిలీజ్ కు సిద్దమైంది. మార్చి 8న ఉమెన్స్ డే స్పెషల్‏గా ‘ఛమ్కీల అంగీలేసి’ అనే ఫోక్ సాంగ్‏ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ‘ఛమ్కీల అంగీలేసి’ సాంగ్ ప్రోమోను […]

మాస్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రాబోతున్న ‘దసరా’ కానుకగా హీరో నాని అందరినీ అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా రేంజ్‏లో 2023 మార్చి 30న ఐదు భాషల్లో రిలీజ్ కు సిద్దమైంది.

మార్చి 8న ఉమెన్స్ డే స్పెషల్‏గా ‘ఛమ్కీల అంగీలేసి’ అనే ఫోక్ సాంగ్‏ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ‘ఛమ్కీల అంగీలేసి’ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇప్పుడు యూట్యూబ్ లో ఆ ప్రోమో దూసుకెళ్తోంది. ఈ సాంగ్‏కి కాసర్ల శ్యాం లిరిక్స్ అందించగా, రామ్ మిర్యాల, దీ పాడారు. ఇప్పటికే నాని నిన్న తన ప్రమోషన్ వీడియోతో పాటపై అంచనాలు పెంచేశాడు.

కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, షైన్ టాం చాకో, సముద్రఖని, జరీనా వహాబ్ మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ మూవీని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Updated On 6 March 2023 7:51 AM GMT
Ehatv

Ehatv

Next Story