సింగర్ గీతామాధురి(Geetha madhuri).. నటుడు నందు(Nandhu) విడాకులు(Divorce) తీసుకోబోతున్నారా..? ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత..? ఈ విషయంలో నందు ఏమని క్లారిటీ ఇచ్చాడు.

సింగర్ గీతామాధురి(Geetha madhuri).. నటుడు నందు(Nandhu) విడాకులు(Divorce) తీసుకోబోతున్నారా..? ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత..? ఈ విషయంలో నందు ఏమని క్లారిటీ ఇచ్చాడు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్లకు కొదవ లేదు.. విడాకులకు అంతకంటే లేదు. కొంత మంది పెళ్ళి తరువాత హ్యాపీగా ఉంటే.. మరికొంత మంది విడాకులుతీసుకుని ఎవరి బ్రతుకు వారు బ్రతకుతున్నారు. మరికొంత మంది పరిస్థితి అయితే.. రూమర్స్ మధ్య నలిగిపోవల్సిందే. హ్యాపీగా ఉన్నా లేకున్నా.. వీరు విడాకలు తీసుకుంటున్నారు అంటూ ప్రచారం చేస్తుంటారు. అలాంటి పరిస్థితినే ఎదరుర్కొంటున్నారు టాలీవుట్ జంట గీతా మాధురి, నందు.

ఎవరో విడాకులు తీసుకున్నారని.. మిగతా స్టార్స్ మీద కూడా రకరకాల వార్తలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అందులో నిజంగా జరిగేవి ఎన్నో తెలియదు కాని.. రూమర్లు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి వార్తల్లో చిక్కున్నారు నందు, గీతా మాధురి. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుడు నందు, స్టార్ సింగర్ గీతా మాధురి ప్రేమించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న వీరి గురించి తాజాగా ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి.

ఇద్దరి మధ మనస్పర్ధలు వచ్చాయని.. ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవ్వడంతో.. వీరు ఎప్పుడు స్పందిస్తారా అని అంతా ఎదరు చూశారు. దాంతో తాజాగా నందు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వక తప్పలేదు. నందు నటించిన మాన్షన్ 24(Mansion 24) సినీ ప్రమోషన్లలో భాగంగా నందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నందు ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ.. విడాకుల వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. నేను గీత ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నాము అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు చూసి మేమిద్దరం నవ్వుకున్నామని అన్నారు. మేమిద్దరం విడాకులు తీసుకోబోతున్నాం అంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. వాటిని అస్సలు మేము పట్టించుకోలేదు అన్నారు.

Updated On 22 Oct 2023 3:57 AM GMT
Ehatv

Ehatv

Next Story