బాలయ్య బాబు ఫామ్ లోకి వచ్చిన తరువాత.. విజయ విహారంలో భాగమైన సినిమా వీరసింహారెడ్డి. అఖండ తరువాత హిట్ అయిన మరో సినిమా ఇది. ఈమూవీ 100 రోజులు పూర్తి చేసుకుంది. మరి విజయోత్సవ వేడుక ఎప్పుడంటే..?
బాలయ్య(Balakrishna) బాబు ఫామ్ లోకి వచ్చిన తరువాత.. విజయ విహారంలో భాగమైన సినిమా వీరసింహారెడ్డి(Veerasimha reddy). అఖండ(akanda) తరువాత హిట్ అయిన మరో సినిమా ఇది. ఈమూవీ 100 రోజులు పూర్తి చేసుకుంది. మరి విజయోత్సవ వేడుక ఎప్పుడంటే..?
నందమూరి బాలకృష్ణ(Nandhamuri balakrishna) హీరోగా నటించిన ఊర మాస్ మూవీ వీరసింహారెడ్డి. బోయపాటిని మించి పోయిన యాక్షన్ సీక్వెన్స్ లతో మలిలేని గోపీచంద్ ఈసినిమాను తెరకెక్కించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. సంక్రాంతి కానుకగా.. ఈ ఏడాది జనవరి 12న రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ డే నుంచే విజయ విహారం మొదలు పెట్టింది. వీరసింహారెడ్డి తొలి రోజునే రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించి,.. సక్సెస్ వేవ్ ను అలా కంటీన్యూ చేసింది. ఆ తర్వాత వరస రికార్డ్ లతో దూసుకుపోయింది.
ఇక తాజాగా వీర సింహారెడ్డ వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో మూవీ టీమ్ వంద రోజులు వేడుక చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు వీరసింహారెడ్డి బృందం. రాష్ట్రంలో ఎనిమిది కేంద్రాలలో విజయవంతంగా వంద రోజులని పూర్తి చేసుకుంటోందీ సినిమా. ఏప్రిల్ 23న వీరసింహారెడ్డి వీర మాస్ బ్లాక్ బస్టర్ 100 డేస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్ కు చిత్ర టీమ్ అంతా హాజరుకాబోతుంది.
వీరసింహారెడ్డి విజయవంతంగా హిందూపురం, చిలకలూరి పేట, ఆలూరు లో డైరెక్ట్ గానూ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, ఆదోని, ఆళ్ళగడ్డలో సింగిల్ షిఫ్ట్ తోనూ 10 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా హిందూపురంలో ఈ నెల 23న వంద రోజుల వేడుక జరుగనుందని సమాచారం. అయితే ఈ వేడుకలకు అఫీషియల్ గా వేధిక మాత్రం కన్ ఫార్మ్ కాలేదు. ఎక్కడ నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు టీమ్.