నందమూరి తారకరత్న(Nandhamuri tharaka ratna) మరణాన్ని భార్య అలేఖర్య రెడ్డి(Alekhya Reddy) ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
నందమూరి తారకరత్న(Nandhamuri tharaka ratna) మరణాన్ని భార్య అలేఖర్య రెడ్డి(Alekhya Reddy) ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జ్ఞాపకాలతో జీవిస్తున్నారు. ఒకే రోజు తొమ్మిది సినిమాలకు శ్రీకారం చుట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పిన తారకరత్న తర్వాతికాలంలో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ఆరంభమైన తొమ్మిది సినిమాలలో సెట్స్ మీదకు వెళ్లినవి రెండో మూడో కావడం గమనార్హం. తర్వాతి కాలంలో విలన్‌గా కూడా చేశాడు. అందులో కూడా సక్సెస్ కాకపోవడంతో పాలిటిక్స్‌లోకి వచ్చేద్దామనుకున్నాడు. లోకేశ్(Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్రలో పాలుపంచుకోవాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ యువగళం మొదటి రోజునే తారకరత్నకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కొన్ని రోజులకు చనిపోయాడు. దాంతో భార్య అలేఖ్య రెడ్డి ఒంటరయ్యారు. అలేఖ-తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులాలువేరు కావడంతో వీరిద్దరిని నందమూరి ఫ్యామిలీ అక్కున చేర్చుకోలేదు. దాంతో తారకరత్న తన భార్యతో వేరుగా ఉంటూ వచ్చారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ బాబు. అయినా తారకరత్న తల్లిదండ్రులలో మార్పు రాలేదు. మనవడు, మనవరాళ్లను చూడటానికి కూడా వారు ఇష్టపడలేదు. సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్‌తో అలేఖ్య ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇప్పటికైనా తారకర్న ఫ్యామిలీ, మిమ్మల్ని దగ్గరకు తీసుకున్నారా..? పిల్లల్ని పట్టించుకుంటున్నారా? కోడలిగా అంగీకరించారా..? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దానికి ఆమె ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. గతంలో తమకు ఎవరూ లేరని, ఇప్పుడు కూడా ఎవరూ లేరు కాబట్టి ఎలాంటి తేడా లేదని సమాధానమిచ్చారు. మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ చంద్రబాబుతో(Chandrababu) ఎక్కువ పరిచయం లేదు కానీ నారా లోకేశ్(Nara lokesh) మాత్రం అవసరం ఉన్నప్పుడల్లా తనకు సహాయం చేశారని చెప్పారు. ఇక వై.ఎస్. షర్మిలతో(YS Sharmila) ఉన్న బంధం మాటల్లో చెప్పలేనిదని, మా ఇద్దరిని దేవుడు కలిపాడని చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు అలేఖ్య.