నందమూరి ఖాన్‌దాన్ నుంచి మరో హీరో వస్తున్నాడు. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ నటిస్తున్న సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
నందమూరి ఖాన్‌దాన్ నుంచి మరో హీరో వస్తున్నాడు. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ నటిస్తున్న సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇటీవల అతడి లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మోక్షజ్ఞ(Mokshagna)నటించబోతున్న మొదటి సినిమాకు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వం వహించనున్నాడు. సినిమాకు సింబా(Simbha)అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రశాంత్ ఇప్పుడు మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి కథను రెడీ చేశాడట! ఇదిలా ఉంటే మోక్షజ్ఞ పారితోషికానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటి సినిమాకే మోక్షజ్ఞ భారీ రెమ్యునరేషన్(Remuneration) తీసుకుంటున్నాడని టాక్! ఈ సినిమాకు అతడు తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా 20 కోట్ల రూపాయలు. ఈ సినిమాను బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్వని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో షూటంగ్ జరుపుకోబోతున్నది. అయినా మనవాళ్లే నిర్మాతలు అయినప్పుడు 20 కోట్లు ఏమిటీ 30 కోట్లు అయినా పుచ్చుకోవచ్చని కొందరు అంటున్నారు.