డిఫరెంట్ స్టోరీలను సెలక్ట్ చేసుకుంటూ..ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్. గెలుపు ఓటములు పట్టించుకోకుండా.. టాలీవుడ్ లో తన మార్క్ ఇమేజ్ నుసాధించాడు.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన సినిమా డెవిల్.రిలీజ్ కు రెడీ అవుతున్న ఈమూవీకి తాజాగాసెన్సార్ కంప్లీట్ అయ్యింది. ఇంతకీ ఈ మూవీకి సెన్సార్ వాళ్లు ఇచ్చిన గుర్తింపు ఏమిటంటే..?

డిఫరెంట్ స్టోరీలను సెలక్ట్ చేసుకుంటూ..ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్. గెలుపు ఓటములు పట్టించుకోకుండా.. టాలీవుడ్ లో తన మార్క్ ఇమేజ్ నుసాధించాడు. కళ్యాణ్ రామ్ సినిమాలంటే.. కొత్తగా ఉంటాయి అనిపించుకుంటున్నాడు బింబిసార లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈహీరో.. తాజాగా డెవిల్ సినిమాతో త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.

నందమూరి కళ్యాణ్ రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజామూవీ డెవిల్ .ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే క్యాప్షన్ తో ఈమూవీ రూపొందుతోంది. స్పై థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న డెవిల్ మూవీని అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈమూవీని ఈనెల అనగా డిసెంబ‌ర్ 29న పాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌ల చేయబోతున్నారు. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండటంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ వేగం పెంచారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌తో పాటు పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇక తాజాగా ఈమూవీకి సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ (U/A) స‌ర్టిఫికేట్ ఇచ్చింది. డెవిల్ నిడివి 2 గంట‌ల 40 నిమిషాలు ఉన్న‌ట్లు స‌మాచారం.దేశ‌ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా డెవిల్‌ ముసుగేసుకుని బ్రిటీషర్ల కోసం కళ్యాణ్‌రామ్ ఎందుకు పని చేశాడనే కాన్సెప్ట్ తో ఈసినిమా తెరకెక్కింది. పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న‌ట్లు అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Updated On 21 Dec 2023 7:38 AM GMT
Ehatv

Ehatv

Next Story