హీరోగా తనదైన‌ వెర్సటాలిటీతో మెప్పిస్తోన్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) ... లేటెస్ట్ మూవీ డెవిల్(Devil Movie). ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈసినిమాతో.. తన సక్సెస్ ను కంటీన్యూ చేయాలి అని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్(Kalyan Ram) . ఈమూవీలో చాలా డిఫరెంట్ గ గా కనిపిస్తున్నాడు నందమూరి హీరో.

నమందమూరి నటవారసుడు ..కళ్యాణ్ రామ్ (Kalyan Ram) షూటింగ్ లో గాయపడినట్టు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ చేస్తున్న టైమ్ లో ఆయనకు గాయాలు అయ్యాయట. ఇక వివరాల్లోకి వెళ్తే..

అందరు హీరోల్లా కాకుండా.. కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు కళ్యాణ్ రామ్(Kalyan Ram).రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తున్నాడు కల్యాణ్ రామ్. ఆమధ్య బింబిసార మూవీతో.. లైమ్ లైన్ లోకి వచ్చిన హీరో.. ఈసినిమాతో సూపర్ హిట్ సాధించాడు. హీరోగా తనదైన‌ వెర్సటాలిటీతో మెప్పిస్తోన్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) ... లేటెస్ట్ మూవీ డెవిల్(Devil Movie). ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈసినిమాతో.. తన సక్సెస్ ను కంటీన్యూ చేయాలి అని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్(Kalyan Ram) . ఈమూవీలో చాలా డిఫరెంట్ గ గా కనిపిస్తున్నాడు నందమూరి హీరో.

దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. వైజాగ్ లో జరుగుతున్న ఈ షూటింగ్ లో.. 500 మందితో ఈ ఫైట్‌ను తెర‌కెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సీన్స్ చేస్తున్న టైమ్ లో కళ్యాణ్ రామ్(Kalyan Ram) కు గాయం అయినట్టు తెలుస్తోంది. కాలుకి కాలిన గాయంతో..చర్మ పైకి లేవడంతో.. ప్రధమ చికిత్స చేసి.. హాస్పిటల్ కు పంపించినట్టు సమాచారం.

ఈవిషయం తెలిసి నందమూరి అభిమానులు ఆంధోళన చెందుతున్నారు. ఇక మూవీ టీమ్ మాత్రం ఏం పర్వాలేదని.. చిన్న గాయమే అని చెప్పినట్టు సమాచారం. ఇక ఈ యాక్షన్ సీన్స ను ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ కంపోజ్ చేస్తున్నారట.ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. సూపర్ ఫాస్ట్ గా ఈ షూటింగ్ కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనిచూస్తున్నారట టీమ్. కుదిరితే ఈ సమ్మర్ వరకూ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరి చూడాలి బింబిసార సినిమాతో మెప్పించిన కళ్యాణ్ రామ్.. డెవిల్ తో ఎలాంటి రిజల్ట్ సాధిస్తారో.

Updated On 29 March 2023 7:50 AM GMT
Ehatv

Ehatv

Next Story