హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌(Kalyan Ram) తన కొత్త సినిమా వార్త చెప్పారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో యాక్షన్ ఫిల్మ్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. జులై 5వ తేదీ కల్యాణ్‌రామ్‌ బర్త్‌డే .. ఈ సందర్భంగానే పంచ్‌ పవర్‌ ఇంత బలంగా ఉంటుందంటూ తన కొత్త సినిమాని ప్రత్యేక పోస్టర్‌తో ప్రకటించారు కల్యాణ్‌రామ్‌. కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లో ఇది 21వ చిత్రం. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌తో కలిసి అశోక్‌ క్రియేషన్స్‌ పతాకంపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా,

హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌(Kalyan Ram) తన కొత్త సినిమా వార్త చెప్పారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో యాక్షన్ ఫిల్మ్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. జులై 5వ తేదీ కల్యాణ్‌రామ్‌ బర్త్‌డే .. ఈ సందర్భంగానే పంచ్‌ పవర్‌ ఇంత బలంగా ఉంటుందంటూ తన కొత్త సినిమాని ప్రత్యేక పోస్టర్‌తో ప్రకటించారు కల్యాణ్‌రామ్‌. కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లో ఇది 21వ చిత్రం. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌తో కలిసి అశోక్‌ క్రియేషన్స్‌ పతాకంపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పకులు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ నిర్ణయించలేదు. కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమా రూపొందుతోందని, ఆయన సరికొత్త యాక్షన్‌ అవతారంలో కనిపిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. విజయవంతమైన ‘అలా ఎలా?’ తర్వాత అశోక్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌ ‘డెవిల్‌’ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత పట్టాలెక్కనున్న చిత్రం ఇదే. త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని వెల్లడించనున్నారు. కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న డెవిల్‌ ప్రచార చిత్రాన్ని బుధవారం విడుదల చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం డెవిల్‌ అనే ఓ బ్రిటిష్‌ ఏజెంట్‌ ఉండేవాడు...’ అంటూ కల్యాణ్‌రామ్‌ పాత్రని పరిచయం చేశారు. ఆయన సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రలో రహస్యాన్ని ఛేదించే పాత్రలో సందడి చేయనున్నారు. యాక్షన్‌, థ్రిల్లింగ్‌ అంశాల మేళవింపుగా ఈ సినిమా రూపొందుతోంది. కల్యాణ్‌రామ్‌ సరసన సంయుక్త మేనన్‌ నటించారు. నవీన్‌ మేడారం దర్శకత్వంలో అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. శ్రీకాంత్‌ విస్సా ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చారు.

Updated On 6 July 2023 5:28 AM GMT
Ehatv

Ehatv

Next Story