నందమూరి కుటుంబం(Nandhamuri) నుంచి హీరోలు చాలా మందే వచ్చారు. అందులో నిలదొక్కుతున్నది బాలకృష్ణ(Balakrishna). ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr NTR) అయితే పాన్‌ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమాతో ఇంటర్నేషనల్‌ స్టార్‌ కూడా అయ్యారు. లాస్టియర్‌ నందమూరి ఫ్యామిలీ నుంచి చైతన్యకృష్ణ(Chaithanya Krishna) అనే హీరో వచ్చాడు. బ్రీత్‌(Breath) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

నందమూరి కుటుంబం(Nandhamuri family) నుంచి హీరోలు చాలా మందే వచ్చారు. అందులో నిలదొక్కుతున్నది బాలకృష్ణ(Balakrishna). ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr NTR) అయితే పాన్‌ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమాతో ఇంటర్నేషనల్‌ స్టార్‌ కూడా అయ్యారు. లాస్టియర్‌ నందమూరి ఫ్యామిలీ నుంచి చైతన్యకృష్ణ(Chaithanya Krishna) అనే హీరో వచ్చాడు. బ్రీత్‌(Breath) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు బిచాణా ఎత్తేసిందో నందమూరి కుటుంబసభ్యులకు, ఆ సినిమా రూపొందించిన వారికి తప్ప మరెవ్వరికి తెలియదు. తన సినిమాను ఫ్లాప్‌ చేసిన ప్రేక్షకులపై కసి పెంచుకున్న చైతన్యకృష్ణ ఇప్పుడు మరో సినిమాతో రెడీ అవుతున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని సవాల్ విసురుతున్నాడు. ఎన్టీఆర్‌ కుమారుల్లో జయకృష్ణ ఒకరు. ఆయన కుమారుడే చైతన్యకృష్ణ. అప్పుడెప్పుడో జగపతిబాబు హీరోగా వచ్చిన ధమ్‌ సినిమాలో ఓ పాత్ర పోషించాడు. పాపం ప్రేక్షకుల మీద జాలితో నటనను పక్కన పెట్టేశాడు. మళ్లీ ఏమైందో ఏమో కానీ మొన్నామధ్య బ్రీత్‌ అనే సినిమాను చేశాడు. తండ్రి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాతో చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది.
గత ఏడాది థియేటర్లలో విడుదలయ్యి ఏ మాత్రం కలెక్షన్స్ తెచ్చుకోని బ్రీత్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నది. ఇప్పుడు మరో కొత్త మూవీ చేయబోతున్నారనే వార్త వినిపిస్తోంది. జి.కె.చౌదరి అనే కో-డైరెక్టర్‌ చైతన్యకృష్ణతో సినిమా చేయబోతున్నట్టు ఫేస్‌బుక్‌లో ఓ ఫోటో షేర్‌ చేశారు. అంత పెద్ద సాహసానికి ఒడిగడుతున్న చౌదరిగారికి ముందస్తు అభినందనలు.. అన్నట్టు నిన్న ఫేస్‌బుక్‌ కాసేపు ఆగిపోవడానికి, చౌదరిగారి ప్రకటనకు ఎలాంటి సంబంధం లేదన్నది పాఠకులు గమనించాలి.

Updated On 6 March 2024 12:55 AM GMT
Ehatv

Ehatv

Next Story