Nandamuri Chaitanya Krishna : చైతన్యకృష్ణ వార్నింగ్‌కు బ్రీత్ మానేసిన నాని, వంశీ
నందమూరి చైతన్యకృష్ణ(Nandamuri Chaitanya Krishna) అంటే ఫ్యామిలీ మెంబర్లకు తప్ప అందరికీ హడలే! ఎక్కడ మళ్లీ సినిమా తీస్తాడేమోనన్న భయం.. ఆ బ్రీత్ స్టార్ వార్నింగ్ ఇస్తే మామూలుగా ఉండదు కదా! హీరోగారు హెచ్చరించడంతో కొడాలి నాని(Kodali Nani), వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) వణికిపోతున్నారట! మొన్న జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) పుట్టిన రోజు కదా! ఈ సందర్భంగా చాలా మంది సెలెబ్రెటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Nandamuri Chaitanya Krishna
నందమూరి చైతన్యకృష్ణ(Nandamuri Chaitanya Krishna) అంటే ఫ్యామిలీ మెంబర్లకు తప్ప అందరికీ హడలే! ఎక్కడ మళ్లీ సినిమా తీస్తాడేమోనన్న భయం.. ఆ బ్రీత్ స్టార్ వార్నింగ్ ఇస్తే మామూలుగా ఉండదు కదా! హీరోగారు హెచ్చరించడంతో కొడాలి నాని(Kodali Nani), వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) వణికిపోతున్నారట! మొన్న జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) పుట్టిన రోజు కదా! ఈ సందర్భంగా చాలా మంది సెలెబ్రెటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు కొడాలి నాని కూడా ఎన్టీఆర్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఓ రేర్ ఫోటోను కూడా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. 'నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ఓ క్యాప్షన్ రాశారు. ఇది నందమూరి చైతన్యకృష్ణకు నచ్చలేదు. ఫేస్‌బుక్‌లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. 'జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు, అలాగే వైసీపీ వాళ్లను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి.. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ .. మీరు ఎవరూ మా బొచ్చు కూడా పీకలేరు. నేను ఉండగా చంద్రబాబునాయుడు(Chandrababu) మావయ్యను, నందమూరి బాలకృష్ణ బాబాయ్‌ని(Balakrishna) టచ్ కూడా చెయ్యలేరు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మీరంతా (ఎన్టీఆర్ ఫ్యాన్స్, వైసీపీ వాళ్లు) కలిసి నన్ను బాగా ట్రోల్స్ చేశారు. జాగ్రత్తగా ఉండండి' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు చైతన్యకృష్ణ. ఈ వార్నింగ్‌ను చూసి నాని, వంశీ దడుసుకున్నారట! వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఫాన్స్ కూడా భయపడిపోతున్నారట! ఎందుకంటే చైతన్యకృష్ణ బాబాయ్ కంటిచూపుతో చంపేస్తే.. ఇతడేమో సినిమాలతో చంపేస్తాడాయె!
