చాలా మంది నిర్మాతలు కూడా ప్రస్తుతం బాలకృష్ణ మార్కెట్‌ను చూసి ఆయనతో సినిమాలు చేయడానికి

టాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ పాపులారిటీని సంపాదించాయి. మన స్టార్స్ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. వరుస పాన్-ఇండియా సినిమాలు మన హీరోలు చేస్తూ ఉండడంతో బడ్జెట్‌లు, థియేట్రికల్ రైట్స్, ఫిల్మ్ మేకింగ్‌లో చాలా రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్లు కూడా ట్రేడ్ పరంగా దూసుకుపోతున్నారు. కొన్ని విషయాలలో బాలయ్య సినిమాలు.. చిరంజీవిని మించిపోయినట్లు కనిపిస్తోంది. అఖండకు ముందు బాలకృష్ణ వేరు, అఖండ తర్వాత ఆయన మార్కెట్ వేరని తెలుస్తోంది. ఆయన మార్కెట్ బాగా పెరిగింది. అఖండ తర్వాత వరుసగా వీరసింహారెడ్డి, భగవంతం కేసరి వంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని బాలయ్య క్రేజీ చిత్రాలకు సైన్ చేస్తున్నాడు.

చాలా మంది నిర్మాతలు కూడా ప్రస్తుతం బాలకృష్ణ మార్కెట్‌ను చూసి ఆయనతో సినిమాలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ మార్కెట్ మునుపటి కంటే చాలా పెద్దదిగా మారింది. ఇక మెగాస్టార్ చిరంజీవితో పోలిస్తే బాలయ్య బాబు రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువే. ఇక శాటిలైట్ పార్టనర్స్‌కి కూడా బాలయ్య సినిమాలు బాగా పనిచేస్తున్నాయి. భగవంత్ కేసరి సినిమాకు టీఆర్పీ 9.36 రాగా.. వీరసింహా రెడ్డి 8.83, అఖండ 13.31 సినిమాలకు టెలివిజన్ ప్రీమియర్‌లలో మంచి TRP రేటింగ్‌lu వచ్చాయి. చిరంజీవి తాజా చిత్రాలు 5-7 రేటింగ్‌ల మధ్య మాత్రమే ఉన్నాయి. ఇక బాలయ్య హిందీ డబ్ ప్రీమియర్ లకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా రేటింగ్ లు వస్తూ ఉండడంతో ఈ విషయంలో బాలయ్య దూసుకుపోతూ ఉన్నాడు.

Updated On 8 Feb 2024 10:55 PM GMT
Yagnik

Yagnik

Next Story