బాలకృష్ణ ప్రస్తుతం బాబీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదలైంది

నందమూరి హీరోలతో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ సినిమా చేస్తున్నాడంటే అంచనాలు భారీగా ఉంటాయి. అలాగే నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇక అభిమానులలో జోష్ ను అసలు ఊహించలేము. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో బాలకృష్ణ సినిమా చేయడం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ వంటి మూడు బ్లాక్‌బస్టర్‌లు వచ్చాయి.

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత బాలయ్య మళ్లీ బోయపాటితో చేతులు కలపనున్నాడు. ఉగాదికి అధికారిక ప్రకటన చేసి జూలైలో షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను అఖండ 2 తో వస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ అఖండకు సీక్వెల్ లేదా మరొక కమర్షియల్ ఎంటర్టైనరా అనేది ఇంకా ధృవీకరించలేదు. 2010లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్‌’ కూడా సూపర్ హిట్ నిలిచింది. ఇక ‘అఖండ’ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.

Updated On 15 March 2024 11:24 PM GMT
Yagnik

Yagnik

Next Story