కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్‌లో నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం 'సత్యభామ'

కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్‌లో నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం 'సత్యభామ' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ పాల్గొననున్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తప్పిపోయిన వ్యక్తి కేసును పరిశోధించే మహిళా పోలీసు కథను చూపిస్తుంది.

మే 31, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. నిర్మాతలు ఈ సినిమా ప్రమోషన్లపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ట్రైలర్ లాంచ్‌కు బాలయ్యను ఆహ్వానించడం మంచి ప్రమోషనల్ మూవ్. గత కొన్ని నెలలుగా బాలయ్య ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య ఈ మూవీ ఈవెంట్ లో ఏమి మాట్లాడుతారా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈవెంట్ 24 మే, 2024న (సాయంత్రం 6:30) జరగనుంది. ఈ సినిమా మాత్రమే కాకుండా జూన్ 12, 2024న గ్రాండ్ రిలీజ్ కానున్న కమల్ హసన్ 'ఇండియన్-2' లో కూడా కాజల్ అగర్వాల్ భాగం. శంకర్ షణ్ముగం దర్శకత్వం వహించిన ఈ విజిలెంట్ థ్రిల్లర్‌లో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, వివేక్, S. J. సూర్య కూడా నటించారు.

Updated On 22 May 2024 11:46 PM GMT
Yagnik

Yagnik

Next Story