హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఆయన పుట్టినరోజు వేడుకలను హిందూపురంలోనే నిర్వహిస్తున్నారు. సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలయ్యకు వేదపండితుల ఆశ్వీరచనాలు అందజేశారు. హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య హాట్రిక్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సొంత నియోజకవర్గంలో అభిమానుల వద్ద ఆయన జన్మదిన వేడుకలు చేసుకున్నారు.

ఇక నందమూరి బాలకృష్ణ- బాబి కాంబోలో తెరకెక్కుతున్న 'ఎన్‌బీకే 109' నుంచి మేకర్స్ తాజాగా అప్‌డేట్‌ ఇచ్చారు. జాలి, దయ పదాలకు అర్థం తెలియని ఓ అసురుడిగా బాలయ్య కనిపించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, ఊర్వశీ రౌతెలా, చాందిని చౌదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Updated On 10 Jun 2024 1:54 AM GMT
Yagnik

Yagnik

Next Story