బాలయ్య బాబుకు హిందూపురం ఎమ్మెల్యేగా, సినీ నటుడిగా ఎంతో గుర్తింపు ఉంది. హీరోగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు ఎంతో మంది ఫ్యాన్స్ అండ్ యాంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇటు ఓటీటీ ప్లాట్ ఫామ్ (Aha)లో అన్‏స్టాపబుల్ టాక్ షో పేరుతో ఓ షోకి హోస్ట్ గా చేస్తూ సత్తా చాటారు. అయితే ఈ రియాలిటీ షో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఇక ఈ షోతో బాలయ్య బాబు ఓ కొత్త రికార్డును కూడా క్రియేట్ చేశారు.

బాలయ్య బాబుకు హిందూపురం ఎమ్మెల్యేగా, సినీ నటుడిగా ఎంతో గుర్తింపు ఉంది. హీరోగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు ఎంతో మంది ఫ్యాన్స్ అండ్ యాంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇటు ఓటీటీ ప్లాట్ ఫామ్ (Aha)లో అన్‏స్టాపబుల్ టాక్ షో (Unstoppable with NBK) పేరుతో ఓ షోకి హోస్ట్ గా చేస్తూ సత్తా చాటారు. అయితే ఈ రియాలిటీ షో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఇక ఈ షోతో బాలయ్య బాబు ఓ కొత్త రికార్డును కూడా క్రియేట్ చేశారు.

అన్‏స్టాపబుల్ విత్ ఎన్‏బీకే టాక్ షో ఐఎండీబీ (Imdb) రేటింగ్స్‏లో మంచి ప్లేస్‏ను కొట్టేసింది. ఐఎండీబీ (Imdb) టాప్ 50 టాక్ షోలలో మన బాలయ్య బాబు టాక్ షో 18వ స్థానంలో నిలిచింది. అయితే ఈ టాక్ షోలో ఇప్పటికే సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రవి తేజ, మహేష్ బాబు, నాని, రాజమౌళి, ఎంఎం కీరవాణి, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, పవన్ కల్యాణ్ వంటి నెంబర్ స్టార్స్ పార్టిసిపేట్ చేశారు.

అన్‏స్టాపబుల్ షోకి మొదటగా నాని, వెంకటేష్ లాంటి వారిని హోస్ట్‏గా తీసుకుందామనుకున్నారట. వాళ్లు రిజెక్ట్ చేయడంతో బాలయ్యను సంప్రదించారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఫైనల్ గా ఈ షోకు బాలయ్య బాబు హోస్ట్ గా వ్యవహరించి ఎందరినో మెప్పించి షోకు మాంచి రెస్పాన్స్ తెప్పించాడు మన బాలయ్య బాబు.

ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య బాబు (Balayya Babu) ఆయన ఫ్యాన్స్‏కు మరో గుడ్ న్యూస్ చెవిలో వేశాడు. క్రికెట్ అభిమాలను ఖుషీ చేసేందుకు కామెంటేటర్ అవతారం ఎత్తేందుకు రెడీ అవ్వబోతున్నాడు. ఈ విషయంపై.. టాటా ఐపీఎల్‏ 2023(Tata IPL 2023) బాలకృష్ణ కామెంటరీతో అదరగొట్టనున్నట్టు స్టార్ స్పోర్ట్స్ (Star Sports) అఫిషియల్‏గా అనౌన్స్ చేసింది. మార్చి 31న స్టార్టవనున్న ఐపీఎల్ ఓపెనింగ్ డే రోజు నందమూరి బాలకృష్ణ కామెంటరీ ఉంటుందని తెలిపింది. ఇందుకోసం అఫిషియల్‏గా ఓ ట్వీట్ కూడా చేసింది స్టార్ స్పోర్ట్స్.

Updated On 27 March 2023 7:10 AM GMT
Ehatv

Ehatv

Next Story