అప్పుడే అఖండ(Akhanda) సినిమాకు రెండేళ్లు పూర్తి అయ్యాయి. ఈమధ్యే రిలీజ్ అయ్యింది అనుకున్నంతలోపే రెండేళ్ళు పూర్తిచేసుకుంది సినిమా. అఖండ దెబ్బకు .. ఆ మ్యూజిక్ కు.. థియేటర్లలో స్క్రీన్ లు చిరిగిపోయాయి.

అప్పుడే అఖండ(Akhanda) సినిమాకు రెండేళ్లు పూర్తి అయ్యాయి. ఈమధ్యే రిలీజ్ అయ్యింది అనుకున్నంతలోపే రెండేళ్ళు పూర్తిచేసుకుంది సినిమా. అఖండ దెబ్బకు .. ఆ మ్యూజిక్ కు.. థియేటర్లలో స్క్రీన్ లు చిరిగిపోయాయి.

చాలా కాలం ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడ్డాడు నట సింహం నందమూరి బాలయ్య(Nandhamuri Balakrishna). సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తున్నప్పుడు.. గతంలో తనకు హిట్ ఇచ్చిన బోయపాటిని(Boyapati Sreenu) మళ్లీ లైన్ లోకి తీసుకున్నాడు. ఇక ఆ దెబ్బతో బాలకృష్ణ రూటే మారిపోయింది. హ్యాట్రిక్ వైపు అడుగు వేయించింది. ఇక తాజాగా హ్యాట్రిక్ హిట్ కు బీజాలు వేసిన అఖండ సినిమా రెండేళ్ళ పండగను పూర్తి చేసుకుంది.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అఖండ. ఈ మూవీలో బాలయ్య రైతు(Farmer) గా అలానే అఘోరా(Aghora) గా రెండు పాత్రల్లో కనిపించి తన అద్భుత నటనతో ఆడియన్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు. ఈ యాక్షన్ ఎమోషనల్ ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ మూవీలో ప్రగ్య జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్ గా నటించగా నెగటివ్ పాత్రల్లో శ్రీకాంత్(srikanth), నితిన్ మెహతా నటించారు. థమన్(Thaman) సంగీతం అందించిన సాంగ్స్, బీజీఎమ్ ఈ మూవీకి ప్రధాన హైలైట్ గా నిలిచాయి.

ఇక ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు బోయపాటి శ్రీను. ద్వారకా క్రియేషన్స్ సంస్థ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన అఖండ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుని నిర్మాతలు, బయ్యర్లకు కాసులు కురిపించింది. ఇక ఈ మూవీ నేటితో సక్సెసుల్ గా రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో పలువురు బాలయ్య ఫ్యాన్స్ అలానే ఆడియన్స్ యూనిట్ కి తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేస్తున్నారు.

Updated On 3 Dec 2023 2:55 AM GMT
Ehatv

Ehatv

Next Story