బిగ్ బాస్-7(Bigg Boss 7) విజేత పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) కు బెయిల్(Bail) మంజూరు అయ్యింది. నాంపల్లి కోర్టు(Nampally Court) పల్లవి ప్రశాంత్ కు షరతులతో కూడిన బెయిల్(Codintion Bail) మంజూరు చేసింది. అయితే ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని బెయిల్ ఉత్తర్వులలో పేర్కొంది.

Pallavi Prashanth Bail

పల్లవి ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. గజ్వేల్ మండలం కొల్గూరులో ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం ఇరువురిని జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్ గుడా జైలుకు తరలించారు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం జరిగిన అల్లర్లలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.