మొన్నటి సంక్రాంతి బరిలో కాసిన్ని కాసులను, కాసింత పేరును తెచ్చుకున్న సినిమా నా సామిరంగ. నాగార్జున(Nagarjuna)కు ఇది డీసెంట్‌ హిట్టే! మహేశ్‌బాబు గుంటూరుకారం, వెంకటేశ్‌ సైంధవ్‌లతో పోలిస్తే ఇది బెటరేనని అన్నారు చాలా మంది.

మొన్నటి సంక్రాంతి బరిలో కాసిన్ని కాసులను, కాసింత పేరును తెచ్చుకున్న సినిమా నా సామిరంగ. నాగార్జున(Nagarjuna)కు ఇది డీసెంట్‌ హిట్టే! మహేశ్‌బాబు గుంటూరుకారం, వెంకటేశ్‌ సైంధవ్‌లతో పోలిస్తే ఇది బెటరేనని అన్నారు చాలా మంది. నాగార్జునలో ఈ సినిమా ఆత్మవిశ్వాసం నింపింది. ఆ ఉత్సాహంతోనే శేఖర్‌ కమ్ముల సినిమాను కూడా వేంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు నాగార్జు. ధనుష్‌ కథనాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున అండర్‌వరల్డ్‌ డాన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ధారవి అనే పేరును అనుకుంటున్నారట! ముంబాయిలోని ఓ స్లమ్‌ ఏరియాకు ధారవి అని పేరు. ఏసియాలోనే అతి పెద్ద స్లమ్‌ ఏరియాగా పేరొందింది. ఈ ప్రాంత నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందట! ఇదిలా ఉంటే తమిళ దర్శకుడు నవీన్‌ దర్శకత్వంలో కూడా నాగార్జున ఓ సినిమా చేయబోతున్నారు. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమాగా ఉంటుందట! అయితే ఇది ఓటీటీ సినిమాగా రానుందని సమాచారం. అన్నింటి కంటే ముఖ్యమైన విషయమేమిటంటే మహేశ్‌బాబుతో ఎస్‌.ఎస్‌.రాజమౌళి రూపొందిస్తున్న సినిమాలో నాగార్జున ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారన్నది లేటెస్ట్‌ టాక్‌. ఈ విషయంపై నాగార్జున, రాజమౌళి మధ్య చర్చలు కూడా జరిగాయట! ఇది ఫైనలైజ్‌ అయితే మాత్రం అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూసే అవుతుంది.

Updated On 12 Feb 2024 1:25 AM GMT
Ehatv

Ehatv

Next Story