అక్కినేని నాగచైతన్య, దూళిపాళ్ల శోభిత వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.

అక్కినేని నాగచైతన్య, దూళిపాళ్ల శోభిత వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 4వ తేదీ రాత్రి 8 గంటల 13 నిమిషాలకు శోభిత మెడలో నాగచైతన్య మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి తంతు మొదలయ్యింది. మంగళస్నానాలు అయిపోయాయి. వివాహ వేదిక అయిన అన్నపూర్ణ స్టూడియోను అందంగా అలంకరించారు. పెళ్లి కొడుకుకు తండ్రి నాగార్జున పెళ్లికి ముందే ఓ ఖరీదైన కానుక ఇచ్చాడు. రెండున్నర కోట్ల రూపాయల లెక్సెస్‌ కంపెనీకి చెందిన కారును ఈ మధ్యనే నాగార్జున కొన్నారు. ఆ కారులోనే రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చి తన పేరిట రిజిస్టర్‌ చేయించుకున్నారు. పెళ్లి పనులు వదిలేసి నాగార్జున ఈ కారు పనులు ఎందుకు పెట్టుకున్నారా అన్న సందేహం చాలా మందికి వచ్చింది. ఇప్పుడు వారి అనుమానాలు తీరాయి. ఆ కారును కొన్నది తన కోసం కాదట! కొడుకు-కోడలికి కానుకగా ఇవ్వడానికేనట! అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారు ధర రెండు కోట్ల 46 లక్షల రూపాయలు! అన్నట్టు పెళ్లికి సుమారు 300 మంది అతిథులు రాబోతున్నారు. అంటే చాలా దగ్గరివారినే పిలుస్తున్నారన్నమాట!

ehatv

ehatv

Next Story