నాగ చైతన్య(naga chaitanya) ,కృతి శెట్టి (krithi shetty)జంటగా నటించిన కస్టడీ(custody) సినిమా ఈ సమ్మర్ సీజన్లో రాబోయే మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా గురించి అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందు ఉంచుతున్నారు . దీనిలో భాగంగానే "టైమ్‌లెస్ లవ్..." సాంగ్  లిరికల్ వీడియోను ఈ చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసారు .ఈ పాటలో హీరో ,హీరోయిన్ పూర్తిగా రెట్రో స్టయిల్ లో కనిపించారు . అయితే ఇప్పుడు ఈ లిరికల్ వీడియో విడుదల అయిన కొద్దిగంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ ని సంపాదించచుకొని యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

నాగ చైతన్య(Naga chaitanya) ,కృతి శెట్టి జంటగా నటించిన కస్టడీ(custody) సినిమా ఈ సమ్మర్ సీజన్లో రాబోయే మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా గురించి అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందు ఉంచుతున్నారు . దీనిలో భాగంగానే "టైమ్‌లెస్ లవ్..." సాంగ్ లిరికల్ వీడియోను ఈ చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసారు .ఈ పాటలో హీరో ,హీరోయిన్ పూర్తిగా రెట్రో స్టయిల్ లో కనిపించారు . అయితే ఇప్పుడు ఈ లిరికల్ వీడియో విడుదల అయిన కొద్దిగంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ ని సంపాదించచుకొని యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

మూవీ మేకర్స్‌తో పాటు, నాగ చైతన్య(Naga chaitanya) ఇంకా కృతి శెట్టి (krithi shetty)కూడా తమ ట్విట్టర్ (twitter)పేజీలలో ఈ పాటను షేర్ చేసారు ..

ఈ సాంగ్ కి సంబందించిన పోస్టర్లు కూడా కలర్‌ఫుల్‌గా కనిపించాయి . చై ఇంకా కృతిని పాతకాలపు డ్రెస్సింగ్ స్టైల్ ని మోడరన్ లుక్ ఇచ్చిన ఫోటోను మనం చూడవచ్చు . ఈ పాటను సరైన పాతకాలపు టచ్ ఇవ్వడానికి కోసం వినూత్న టెక్నాలజీతో పాటు భారీ సెట్లలో విభిన్నంగా ఈ పాటను చిత్రీకరించారని సమాచారం . మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా(ilayaraja) , ఆయన కొడుకు యువన్ శంకర్ రాజా(Yuvan shankar raja) ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంగీతాన్ని సమకూర్చారు . శాక్సోఫోన్, ఫ్లూట్, ట్రంపెట్ ఇంకా ట్రోంబోన్ బీట్‌లను ఉపయోగించి ఈ పాటకు అరుదైన రీతిలో ప్రత్యేకమైన టచ్ ని ఇవ్వడం జరిగింది . పార్టీ నంబర్ సాంగ్ కావటం తో ఈ పాట ఇప్పటికే చాలా ప్లేలిస్ట్‌లకు యాడ్ అవ్వటంతో సూపర్ హిట్‌ అయ్యింది !

తమిళం ఇంకా తెలుగు ద్విభాషా చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కి వెంకట్ ప్రభు దర్శకత్వం(venkat prabhu) వహించారు . శ్రీనివాస చిట్టౌరి తన హోమ్ బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై నిర్మించారు. ఇందులో నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమి అమరెన్, వెన్నెల కిషోర్ ఇంకా ప్రేమి విశ్వనాథ్ నటించటం జరిగింది . కస్టడీ సాంకేతిక వివరాలతో వెళితే, ఎస్ఆర్ కతీర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, డివై సత్యనారాయణ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసారు . కస్టడీ సినిమా(custody) 12 మే, 2023న థియేటర్లలోకి రాబోతుంది .

Updated On 24 April 2023 5:34 AM GMT
rj sanju

rj sanju

Next Story