కొణిదెల నాగబాబు(Nagababu) మళ్లీ ఎక్స్‌లోకి(twitter), అదేనండి ట్విట్టర్‌లోకి వచ్చేశాడు. మొన్నామధ్యన ఈయన పెట్టిన ఓ ట్వీట్‌ ఎంత పెద్ద దుమారం రేపిందో మనకు తెలుసు! అల్లు అర్జున్‌(Allu Arjun) అభిమానులు ఈయన ట్వీట్‌పై మండిపడ్డారు. నాగబాబును ట్రోల్స్‌తో ఓ ఆట ఆడుకున్నారు. విమర్శలు చేశారు. కొందరైతే దుర్భాషలాడారు కూడా! ఇలా జరుగుతుందని అనుకోని నాగబాబు వెంటనే తన ట్విట్టర్‌ అకౌంట్‌ను డి యాక్టివేట్‌ చేశాడు.

కొణిదెల నాగబాబు(Nagababu) మళ్లీ ఎక్స్‌లోకి(twitter), అదేనండి ట్విట్టర్‌లోకి వచ్చేశాడు. మొన్నామధ్యన ఈయన పెట్టిన ఓ ట్వీట్‌ ఎంత పెద్ద దుమారం రేపిందో మనకు తెలుసు! అల్లు అర్జున్‌(Allu Arjun) అభిమానులు ఈయన ట్వీట్‌పై మండిపడ్డారు. నాగబాబును ట్రోల్స్‌తో ఓ ఆట ఆడుకున్నారు. విమర్శలు చేశారు. కొందరైతే దుర్భాషలాడారు కూడా! ఇలా జరుగుతుందని అనుకోని నాగబాబు వెంటనే తన ట్విట్టర్‌ అకౌంట్‌ను డి యాక్టివేట్‌ చేశాడు. అంతా సద్దుమణిగిన తర్వాత ఇప్పుడు మళ్లీ యాక్టివేట్ చేసుకున్నాడు. అంతేనా అల్లు అర్జున్‌ను పరోక్షంగా దెబ్బిపొడిచిన పోస్ట్‌ను కూడా డిలీట్‌ చేశాడు. పైగా ఆ ట్వీట్‌ను తాను డిలీట్‌ చేశానని చెప్పుకున్నాడు. సోమవారం అంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నంద్యాల నుంచి శిల్పా రవిచంద్రారెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశారు. రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్‌ బెస్ట్ ఫ్రెండ్‌. సన్నిహిత మిత్రుడు కాబట్టే ఆయన గెలుపు కోసం నంద్యాలలో ప్రచారం చేశారు అల్లు అర్జున్‌. తనకు పార్టీతో సంబంధం లేదని,. ఫ్రెండ్‌ కాబట్టే వచ్చానని కూడా చెప్పుకున్నాడు. కానీ నాగబాబు మాత్రం అపార్థం చేసుకున్నాడు. అల్లు అర్జున్‌పై అక్కసు వెళ్లగక్కాడు. 'మా పక్కనే ఉంటూ మమ్మల్ని బలహీనపరిచేవాడు మాకు శత్రువే. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే' అంటూ ఓ ట్వీట్‌ చేశాడు. ఇది ఎవరి గురించి చేశాడో తెలియని అమాయకులు కాదుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌.. ఇది తమ బాస్‌ను ఉద్దేశించి చేసిందేనని కోపగించుకున్నారు. నాగబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఏం చేయాలో పాలుపోని నాగబాబు వెంటనే ట్విట్టర్‌ అకౌంట్‌ డీ యాక్టివేట్ చేసుకున్నాడు. వివాదం చల్లారిందనుకున్న నాగబాబు ఇప్పుడు యాక్టివ్‌ చేసుకున్నాడు. కాకపోతే పాత ట్వీట్ డిలీట్‌ చేశానని చెబుతూ తాజాగా ఓ ట్వీట్ పెట్టాడు. అడుసు తొక్కనేల కాలు కడగనేల అని పెద్దలు ఊరికే అనలేదు!

Updated On 18 May 2024 2:58 AM GMT
Ehatv

Ehatv

Next Story