ఈమధ్య రీ రిలీజ్ ల(Re-Release) ట్రెండ్ ఎక్కువైపోయింది. స్టార్ హీరోల సినిమాలు అకేషన్ ప్రకారం రీ రిలీజ్ చేసి.. మేకర్స్ మరోసారి కలెక్షన్లు సాధిస్తున్నారు. ఈ ట్రెండ్ కు బాగా డిమాండ్ వచ్చింది. ఇప్పటికే చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్(Ram Charan),పవన్ కళ్యాణ్(Pawan kalyan), ఎన్టీఆర్(NTR), మహేష్ బాబులాటి(Mahesh babu) స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి మంచి కలెక్షనస్ ను సాధించాయి.

ఈమధ్య రీ రిలీజ్ ల(Re-Release) ట్రెండ్ ఎక్కువైపోయింది. స్టార్ హీరోల సినిమాలు అకేషన్ ప్రకారం రీ రిలీజ్ చేసి.. మేకర్స్ మరోసారి కలెక్షన్లు సాధిస్తున్నారు. ఈ ట్రెండ్ కు బాగా డిమాండ్ వచ్చింది. ఇప్పటికే చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్(Ram Charan),పవన్ కళ్యాణ్(Pawan kalyan), ఎన్టీఆర్(NTR), మహేష్ బాబులాటి(Mahesh babu) స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి మంచి కలెక్షనస్ ను సాధించాయి. ఈక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మూడు నాలుగు సినిమాలు ఇప్పటికే రీ రిలీజ్ అవ్వగా.. తాజాగా గుడుబా శంకర్(Gudumba Shankar) సినిమాను కూడా రీరిలీజ్ చేయబోతున్నట్టు ఈమధ్యప్రకటించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మీరా జాస్మిన్(Meera Jasmine) హీరోయిన్ గా వీరశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గుడుంబా శంకర్. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన ఈ సినిమా 2004లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇక ఈ సినిమాని ఈ ఏడాది ఆగష్టు 31న రీరిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గా ప్రకటించిన నిర్మాత నాగబాబు(Nagababu) మూవీ రీ రిలీజ్ కు బ్రేక్ పడినట్టు తెలిపాడు.

ఈసిసినిమా రిలీజ్ డేట్ మార్చినట్టు నాగబాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గుడుంబా శంకర్ సినిమాను రెండు రోజుల అనంతరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని తాజాగా తన సోషల్ మీడియా(Social media) ప్లాట్ ఫామ్ వేదికగా నాగబాబు వెల్లడించారు. లేటెస్ట్ గా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా తెలిపారు.

మరోవైపు తాజాగా రిలీజ్ అయిన గుడుంబా శంకర్ రీరిలీజ్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా అప్పటి ఆడియన్స్ ని ఆకట్టుకున్న గుడుంబా శంకర్ సాంగ్స్ కూడా మంచి ఆదరణ అందుకున్నాయి. మరి గుడుంబా శంకర్ మూవీ ఇప్పటి ఆడియన్స్ ని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి. ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, రాజన్ పి దేవ్, షాయాజీ షిండే, ఆలీ, జ్యోతి, సునీల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు చేసారు.

Updated On 20 Aug 2023 3:31 AM GMT
Ehatv

Ehatv

Next Story