సెలబ్రిటీలు బయట చాలా అరుదుగా కనిపిస్తుంటారు. హీరో నాగశౌర్య మాత్రం అలా కాదు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని రోడ్డుపై ఓ ప్రేమ జంట గొడవపడుతుంటే నాగశౌర్య కలగచేసుకున్నారు. గొడవపడుతున్నవారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. వారు మాత్రం వినలేదు. మనకెందుకులే అనుకుని వచ్చిన దారిలోనే వెళ్లిపోయాడు నాగశౌర్య. ఈ దృశ్యాలన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

సెలబ్రిటీలు బయట చాలా అరుదుగా కనిపిస్తుంటారు. హీరో నాగశౌర్య మాత్రం అలా కాదు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని రోడ్డుపై ఓ ప్రేమ జంట గొడవపడుతుంటే నాగశౌర్య కలగచేసుకున్నారు. గొడవపడుతున్నవారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. వారు మాత్రం వినలేదు. మనకెందుకులే అనుకుని వచ్చిన దారిలోనే వెళ్లిపోయాడు నాగశౌర్య. ఈ దృశ్యాలన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నాగశౌర్య(Naga shourya) హీరోగా పవన్‌(Pawan) దర్శకత్వంలో వస్తున్న రంగబలి(Rangabali) సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో ఆ రోజు జరిగిన సంఘటనపై వివరణ ఇచ్చుకున్నారు. ఓ అమ్మాయిని ఒక అబ్బాయి ఏడిపిస్తుంటే , మీరు అంతగా ఎందుకు స్పందించారు అని ఓ విలేకరి నాగశౌర్యను అడిగారు. దానికి వివరంగా జవాబిచ్చారు. ' ఆ రోజు జరిగింది పూర్తిగా వేరు. నేను పనిలమీద కూకట్‌పల్లి(Kukatpalli) నుంచి వెళుతున్నాను. ఆ సమయంలో ఓ అబ్బాయి ఓ అమ్మాయిని కొడుతూ కనిపించాడు.

వెంటనే అక్కడికి వెళ్లి ఎందుకు కొడుతున్నావు. సారీ చెప్పు అని అన్నాను. అతడు రియాక్టయ్యేలోపు అమ్మాయి స్పందించింది. నా బాయ్‌ఫ్రెండ్‌ కొడితే కొడతాడు. చంపితే చంపుతాడు. నీకేంటి అని నాకు కౌంటర్‌ వేసింది. అమ్మాయిలే అలా అంటే ఇక ఏం చెబుతాం. ఆ రోజు జరిగిన సంఘటనలో అబ్బాయిది కాదు అమ్మాయిదే తప్పు. ఇంకో రూమర్ ఏంటంటే.. ప్రచారం కోసం ఆ గొడవని నేనే ప్లాన్ చేశానన‍్నారు. కానీ వాళ్లెవరో కూడా నాకు తెలియదు' అని నాగశౌర్య చెప్పుకొచ‍్చాడు. పనిలో పనిగా అమ్మాయిలకు ఓ సలహా కూడా ఇచ్చాడు. ' పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలకు ఒకటే చెబుతున్నా. మిమ్మల్ని కొట్టే అబ్బాయిని మాత్రం పెళ్లి చేసుకోవద్దు. మీకు, మీ ఫ్యామిలీకి అది మంచిది కాదు' అని చెప్పుకొచ్చాడు నాగశౌర్య. రంగబలి సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమా విషయంలో నమ్మకం కంటే ధైర్యంగా ఉన్నానని అన్నాడు.

Updated On 28 Jun 2023 3:10 AM GMT
Ehatv

Ehatv

Next Story