గత రెండు వారాలుగా వీర ప్రమోషన్స్ చేశారు శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ సంస్ధ కస్టడీ(custody) సినిమా కోసం. ఈ నేపథ్యంలో మాంచి హైప్‌లో ఈ రోజే విడుదలైంది కస్టడీ.
గత రెండు వారాలుగా వీర ప్రమోషన్స్ చేశారు శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ సంస్ధ కస్టడీ(custody) సినిమా కోసం. ఈ నేపథ్యంలో మాంచి హైప్‌లో ఈ రోజే విడుదలైంది కస్టడీ. నాగచైతన్య(naga chaithanya), కృతిశెట్టి(krithi shetty), అరవింద్ స్వామి(arvindh swamy), శరత్ కుమార్(sharath kummar) వంటి భారీ కేస్టింగ్ మొత్తం సినిమాలో ప్రధానపాత్రలన్నిటిలోనూ కనిపించి కస్టడీ సినిమా చాలా భారీ నిండుదనాన్ని సంతరించుకుంది. ఇళళరాజా, యువన్ శంకర్ రాజా సంయుక్తంగా సంగీతం సమకూర్చిన తొలి చిత్రంగా కస్టడీ మ్యూజిక్ పరంగా చాలా స్పెషల్.
కథ పరంగా...
సఖినేటిపల్లి ఊరిలో శివ ఒక సాధారణ కానిస్టేబుల్. అదే ఊరిలో ఉన్న రేవతితో ప్రేమలో పడతాడు. కాకపోతే తల్లితండ్రులు అభ్యంతరాలతో వారి ప్రేమ పెళ్ళి వరకూ వెళ్ళ కుండా మధ్యలోనే ఆగిపోతుంది. కథ ముందుకెళ్తున్న కొద్దీ కానిస్టేబుల్ శివ పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ రాజు(అరవింద్ స్వామి)ను అరెస్ట్ చేసి అందరి దృష్టిలో పడతాడు. రాజుతో పాటూ సిబిఐ ఆఫీసర్ జార్జ్(సంపత్‌రాజ్)ను కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది. జార్జ్ ద్వారా రాజును బెంగుళూరు కోర్టులో ప్రజెంట్ చేయాల్సి ఉందని శివకి తెలుస్తుంది.
కానీ రాజుకి రాష్ట్రముఖ్యమంత్రి దాక్షయని(ప్రియమణి) వత్తాసు ఉందని, పోలీసు డిపార్ట్‌మెంటు కూడా టోటల్‌గా సపోర్ట్ చేస్తోందని తెలుసుకుంటాడు శివ. రాజు అన్నయ్య కేవలం రాజు తలపెట్టిన అరాచకానికి బలైపోయాడన్న అక్కసుతో రాజును ఎలాగైనా శిక్షించాలని కూడా రాజు నిర్ణయించుకుంటాడు. కానీ రాజు దొరికిపోయినప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలకు తగ్గట్టుగా రాజును ఎలాగైనా చంపెయ్యాలని శరత్ కుమార్ పాత్ర వెంటపెడుతుంది.
ఆ ప్రమాదం నుంచి తప్పించి, రాజును ఎలాగైనా రక్షించి, బెంగుళూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనే పంతంతో శివ అన్ని ప్రమాదాలను ఎదిరించి, ప్రాణాలకు తెగించైనా సరే ముందుకు సాగుతుంటాడు. ఈ ప్రయాణంలో శివతో కలసి రేవతి కూడా ప్రమాదాలకు లోనవుతుంది. చివరికి ఉత్కంఠభరితమైన టెన్షన్స్ మద్యన రాజు మరణిస్తాడు.
హైలైట్స్
కస్టడీ సినిమా గురించి నాగచైతన్య ప్రతీసారీ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు. దానికి తగ్గట్టుగానే శివ పాత్రలో చైతన్య చాలా అమాయకంగా కనిపిస్తూనే టఫ్‌గా కూడా యాక్ట్ చేసి, ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ ప్లస్ టెన్షన్ డ్రామాను పండించడంలో నాగచైతన్య సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
ప్రతీ సీనులో నాగచైతన్యకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా మొత్తం నాన్‌స్టాప్‌గా పరిగెడుతూ, దర్శకుడు వెంకట ప్రభు బ్రిస్క్ స్క్రీన్‌ప్లేకి అనుగుణంగా షార్స్ నెరేషన్‌తో ఇంట్రస్టింగ్‌గా నడిచింది సినిమా పూర్తిగా. మలుపులన్నీ చాలా ఎక్సైటింగ్‌గా సాగాయి. ప్రధానపాత్రలన్నీ సూపర్‌స్టార్స్ నటించిన కారణంగా ప్రతీసాత్రా సినిమాకి గొప్ప సపోర్ట్‌గా నిలబడింది. ముఖ్యంగా ఆరవింద్ స్వామి, శరత్‌కుమార్ పాత్రలు, వాటిని డైరెక్టర్ ప్రభు ప్లే చేసిన విధానంతో కస్టడీ టెరిఫిక్ టెంపోతో పరిగెత్తింది.
చాలా రోజుల తర్వాత అరవింద్ స్వామి తెరమీద కనిపించడంతో ప్రేక్షకులు రాజు పాత్రను బాగా ఎంజాయ్ చేశారు. పైగా చాలా సెన్సిటివ్ యాక్టర్‌గా ఇమేజ్ ఉన్న అరవింద్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో కనిపించినా, దర్శకుడు ప్రభు మాత్రం గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్‌ని అంతే డీసెంట్‌గా హేండిల్ చేశాడు. రీరికార్డింగ్ సినిమాకి ఊపిరి పోసింది. కృతిశెట్టికి కూడా కథలో కావాల్సినంత ఇంపార్టెన్స్ దొరికింది. నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు పెట్టిన హై బడ్జెట్ సినిమాలో మొదట నుంచి చివరి వరకూ కూడా ప్రతీఫ్రేమ్‌లో కనిపిస్తూనే ఉంది. అందుకే కస్టడీ చాలా రిచ్‌గా కనిపించింది.
మైనస్ పాయంట్స్
ఇంటర్వెల్ ముందు పార్ట్ ఎంతో స్పీడుగా ఉన్నా, సెకండాఫ్ మాత్రం పూర్తి కథను మోసిన కారణంగా స్లో అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే దర్శకుడు ప్రభు ఎంత ఇంట్రస్టింగ్‌గా చెప్పినా, సీక్వెన్స్ బై సీక్వెన్స్ రన్ అవుతుంటే ప్రతీ బిట్ హెవీగా ఉంది. ఫ్లాష్‌బ్యాక్‌తో కలిపి కథ మొత్తం బేక్ అండ్ ఫోర్త్ నెరేట్ చేసేటప్పుడు ఆ టెంపో కొంత జారింది.
బట్ ట్రైన్ ఎపిసోడ్ మాత్రం సూపర్‌గా ఉందని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. ఇళయరాజా ద్వారా వింటేజ్ ఫీల్ తీసుకురావాలన్న ప్రయత్నం మాత్రం ఫలించలేదు. ఏ పాటా చెవులకు ఇంపుగా లేదు. పైగా ఫారెస్ట్ ఎపిసోడ్ మొత్తం చాలా డల్‌గా ఉంది. నాగచైతన్య, అరవింద్, కృతిశెట్టి ముగ్గురు ప్రధానపాత్రలున్నా కూడా ఆ ఎపిసోడ్‌ని మాత్రం పండించడానికి దర్శకుడు వాళ్ళకి అంత గొప్ప స్టఫ్ ఇవ్వలేకపోయాడు.
ఫైనల్ కామెంట్
దానాదీనా, కస్టడీ సినిమా కథపరంగా కొత్తగా ఉంది. దర్శకుడు వెంకటప్రభు గత సినిమాల్లాగే ఇది కూడా ఇంట్రస్టింగ్ కథతో, ఎక్సైటింగ్ స్క్రీన్‌ప్లేతో చాలా డిఫరెంట్‌గా ఉంది. డెఫినెట్‌గా చూడాల్సిన సినిమా కస్టడీ.
నాగేంద్రకుమార్