తెలుగువారికి కులంపట్ల ఉన్న ఆసక్తి మరే విషయంపైన ఉండదని మరోసారి రుజువయ్యింది.
తెలుగువారికి కులంపట్ల ఉన్న ఆసక్తి మరే విషయంపైన ఉండదని మరోసారి రుజువయ్యింది. ఎవరైనా హెడ్‌లైన్‌లో వస్తే చాలు వారి కులగోత్రాలను సెర్చ్ చేయడంలో మనవాళ్లు దిట్ట! ప్రపంచంలో మరెక్కడా ఈ రోగం కనిపించదు. తెలియని వ్యక్తుల గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు కానీ, కులమే ప్రధానంగా భావించడం మాత్రం దారుణం. గతంలో చాలా సార్లు ఇలాంటివి జరిగాయి. తాజగా శోభిత ధూళిపాళ(shobitha dulipali) ఎవరు, ఆమె కులమేమిటి?(Cast) వంటివి లక్షలాది మంది సెర్చ్ చేశారట! నిన్నంతా నెట్‌లో విపరీతమైన సెర్చింగు. ఆమె ఎవరనేది తెలుసుకుంటే తప్పేమీ కాదు కానీ ఆమె కులం ఏమిటని..? మన వాళ్లు తెగ అన్వేషించారు. పదేళ్లుగా ఆమె ఇండస్ట్రీలోనే ఉన్నా చాలా మందికి తెలియకపోవడమే అందుకు కారణం. ఇప్పటి వరకు ఆమె చేసిన తెలుగు సినిమాలు రెండే! ఒకటి గూఢచారి, రెండు మేజర్. ఆ రెండు సినిమాల్లోనూ హీరో అడవి శేషు(adavi sesh) కావడం గమనార్హం. మేజర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా శోభిత టీవీలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. పలు టీవీ షోలలో పాల్గొంది. అప్పుడెవరు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. శోభిత ధూళిపాళ పదహారణాల తెలుగమ్మాయి. బ్రాహ్మణ అమ్మాయి(Bramhin). ఆమెది తెనాలి(Tenali). . తండ్రి ఓ మర్చంట్ నేవీ ఇంజనీర్. తల్లి టీచర్. విశాఖపట్టణంలో పెరిగిన శోభిత స్కూల్ చదవు అయ్యాక ముంబాయికి వెళ్లి కార్పొరేట్ లా చదివింది. అభిరుచి ఉండటంతో భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్‌గా నిలిచింది. మిస్ ఫోటోజెనిక్, మిస్ బ్యూటీ ఫర్ ఎ కాజ్, మిస్ టాలెంట్, మిస్ బ్యూటిఫుల్ ఫేస్ అంటూ రకరకాల గుర్తింపులు పొందింది. ఇదీ ఆమె బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడామె అక్కినేని(Akkineni) కోడలు. నాగచైతన్య(Naga chaithanya) నటించిన ఓ సినిమాలో ఓ డైలాగు ఉంటుంది. ఎస్ అనే అక్షరంతో ఉన్న అమ్మాయే నా జీవితలోకి వస్తుందని నా జాతకంలో ఉంది అని చెబుతాడు నాగచైతన్య. ఎస్ అంటే సమంతనే(Samantha) కాదు, శోభిత కూడా అని మనం అర్థం చేసుకోవాలి. అన్నట్టు శోభిత చెల్లెలు పేరు కూడా సమంత అట! యూట్యూబర్లకు ఈ విషయం తెలియదు కాబోలు. తెలిసుంటే సమంత అక్కతో చైతూ నిశ్చితార్థం అని థంబ్‌నైల్ పెట్టేవారేమో!