సమంత(Samantha)-నాగచైతన్య(Chaithanya) విడాకులు(Divorce) తీసుకుని దాదాపు రెండేళ్లు అవుతోంది. మంచి జంటగా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు విడిపోవడం అభిమానులకు చాలా బాధకలిగించింది. మళ్లీ కలిస్తే బాగుండనే అనుకునేవారు చాలా మందే ఉన్నారు. సమంత-నాగచైతన్య కలుసుకోబోతున్నారనే వార్తలు అప్పుడప్పుడు ప్రచారంలోకి వస్తూ ఫ్యాన్స్‌కు కాసింత ఆశలు చిగురింపచేస్తాయి.

సమంత(Samantha)-నాగచైతన్య(Chaithanya) విడాకులు(Divorce) తీసుకుని దాదాపు రెండేళ్లు అవుతోంది. మంచి జంటగా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు విడిపోవడం అభిమానులకు చాలా బాధకలిగించింది. మళ్లీ కలిస్తే బాగుండనే అనుకునేవారు చాలా మందే ఉన్నారు. సమంత-నాగచైతన్య కలుసుకోబోతున్నారనే వార్తలు అప్పుడప్పుడు ప్రచారంలోకి వస్తూ ఫ్యాన్స్‌కు కాసింత ఆశలు చిగురింపచేస్తాయి. ఇప్పుడు వారిద్దరు వేరు వేరు దారిలో పయనిస్తున్నారన్నది మాత్రం నిజం. వివాహబంధాన్ని తెంచేసుకుని కెరీర్‌పై దృష్టి పెట్టారిద్దరు. వారి వారి రంగాలలో బిజీగా ఉన్నారు. కాకపోతే అప్పుడప్పుడు వారి ప్రేమ గురించి సోషల్‌ మీడియాలో ఇన్‌డైరెక్ట్‌గా స్పందిస్తుంటారు. లేటెస్ట్‌గా నాగ చైతన్య దగ్గర పని చేస్తున్న సిబ్బందిలో ఒకరు కొత్త బైక్‌(Bike) కొన్నారు. దానిపై ఆటోగ్రాఫ్‌(Autograph) కావాలని చైతూను రిక్వెస్ట్‌ చేశారు. ఆయన తన ఇంటి నుంచి బయటకు వచ్చి బైక్‌పై ఆటోగ్రాఫ్‌ ఇవ్వడమే కాకుండా రైడ్‌ కూడా చేశాడు. ఇదే సమయంలో అక్కడ కెమెరా కంటికి ఒక పెట్‌ డాగ్‌(Pet Dog) కనిపించింది. అది సమంత దగ్గర ఉన్న హస్‌ లాగే ఉంది. అరే ఇది సమంత దగ్గర కదా ఉండేది..? ఇక్కడ నాగ చైతన్య ఇంటికి ఎలా వచ్చింది..? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరూ మళ్లీ కలుసుకోబోతున్నారా..? ఒకరికొకరు టచ్‌లో ఉన్నారా..? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం అలాంటిది ఏం లేదంటూనే సేమ్‌ టు సేమ్‌ హస్‌ లాంటి కుక్కపిల్లను నాగ చైతన్య తెచ్చుకున్నారని అంటున్నారు. సమంత దగ్గర ఉన్న పెట్‌ ఆమె దగ్గరే ఉందని చెప్పుకొస్తున్నారు. సమంత-నాగ చైతన్యలలో ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప ఈ విషయంలో క్లారిటీ రాదు.

Updated On 4 Oct 2023 12:22 AM GMT
Ehatv

Ehatv

Next Story