చైతూ నటిస్తున్న తండేల్ మూవీకి.. సాయి పల్లవికి.. శోభిత నిక్ నేమ్ కు సబంధం ఏంటి..?
అక్కినేనివారి కోడలు శోభిత ధూళిపాళను నాగచైతన్య ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..? చైతూ నటిస్తున్న తండేల్ మూవీకి.. సాయి పల్లవికి.. శోభిత నిక్ నేమ్ కు సబంధం ఏంటి..?
శోభితధూళిపాళ(Sobhita Dhulipala)ను పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు నాగచైతన్య(Naga Chaitanya). డిసెంబర్ లో వీరి పెళ్ళి జరగ్గా.. శోభిత గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో పలు విషయాలు వెల్లడిస్తూ వస్తున్నాడు నాగచైతన్య. శోభితతో లైఫ్ చాలా హ్యాపీగా ఉందంటున్నాడు. అంతే కాదు ఇప్పటికే తాను ఏపనిచేయాలి అనుకున్నా.. శోభిత సలహాలు కూడా తీసుకుంటున్నట్టు చైతు చెప్పాడు. హీరోయిన్ సమంత(Samantha)ను దాదాపు ఏడెనిమిదేళ్ళు ప్రేమించి పెళ్ళాడిన నాగచైన్య.. 2017 లో పెళ్ళి చేసుకుని.. నాలుగేళ్ళు కూడా కలిసి ఉండలేకపోయారు. మనస్పర్ధల కారణంగా ఇద్దరు నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు.
ఇక ఆతరువాత కొంత కాలానికే శోభిత ప్రేమలో పడ్డాడు చైతు. చెట్టాపట్టాలేసుకుని మూడునాలుగేళ్ళు తిరిగిన ఈ జంట.. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో పెళ్ళి చేసుకుని ఇంటివారు అయ్యారు. ఈ ఇద్దరు తారల పెళ్ళి టాలీవుడ్(Tollywood) లో అందరిని ఆశ్చర్చానికి గురిచేసింది. ఒక హీరోయిన్ తో విడాకులు మరో హీరోయిన్ తో పెళ్ళి అని రకరకాల కామెంట్లు వినిపించాయి. అవన్నీ పక్కనపెడితే.. శోభితతో కలిసి లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు నాగచైతన్య. అంతే కాదు ఆమెకు ఓ ముద్దు పేరు కూడా పెట్టాడట. ఓన్లీ ఇంటికి వెళ్ళిన తరువాత ఇంట్లో వరకే అలా పిలుస్తాడట చైతూ. తన భార్యను తాను ముద్దుగా ఏమని పిలుస్తాడు అనే విషయాన్ని.. రీసెంట్ గా తండేల్ (Tandel)మూవీ ఫంక్షన్ లో వెల్లడించాడు చైతూ.
ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టం గురించి.. సాయి పల్లవి(Sai Pallavi) నటన గురించి అద్భుతంగామాట్టాడిన నాగచైతన్య.. తండేల్ మూవీలో సూపర్ హిట్ అయిన బుజ్జితల్లి(Bujji Thalli) పాట గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడాడు. బుజ్జితల్లి పాటతో సినిమాను ముందే ఆడియన్స్ లోకి తీసుకెళ్ళారు దేవిశ్రీ(Devi Sri).. ఈసినిమాలో హీరోయిన్ సాయి పల్లవిని బుజ్జితల్లీ అని హీరో పిలుస్తుంటాడు. నేను ఇంట్లో శోభితను కూడా బుజ్జితల్లి అనే పిలుస్తున్నాను. అది అలా అలవాటు అయిపోయింది అన్నారు నాగచైతన్య. దాంతో అక్కినేని ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.
చైతూ లైఫ్ ఇలానే ఏ ఇబ్బందులు లేకుండా గడిచిపోవాలని వారు కోరుకుంటున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. ఈమూవీకోసం దాదాపు రెండు మూడేళ్ళు కష్టపడ్డాడు నాగచైతన్య. సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. చందు మెండేటి(Chandu Mondeti) డైరెక్ట్ చేసిన ఈసినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈనెల 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది తండేల్ సినిమా. మరి ఈసారి అయినా ఈసినిమాతో చైతు హిట్ కొడతాడో లేదో చూడాలి.