డైరెక్టర్ వెంకట్ ప్రభు(Venkat Prabhu), అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) కాంబినేషన్లో రూపొందుతున్న బైలింగ్వల్ ప్రాజెక్టు కస్టడీ(Custody). ఇప్పటికే రిలీజైన టీజర్‌తో ఆడియన్స్‌లో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ హెడ్ అప్ హై(Head Up High) రిలీజ్ అయి ఆడియన్స్ నుంచి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ఇది రిలీజ్ అయిన కొద్దిగంటల్లోనే 1 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది.

Custody Telugu

లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా(Ilaiyaraaja), ఆయన కొడుకు యువన్ శంకర్ రాజా(Yuvan Shankar Raja) మ్యూజిక్ అందించారు. పవర్ఫుల్ లిరిక్స్‌తో మాస్ కాంబోగా రాబోతుంది ఈ మూవీ. హెడ్ అప్ హై సాంగ్‌ను పోలీసులకు నివాళిగా ఈ పాటను యువన్ శంకర్ రాజా, అరుణ్ కౌండిన్య, అసల్ కొలార్ పాడగా.. సరస్వతిపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. సాంగ్ అంతా ఫుల్ ఎనర్జిటిగ్ ఉంటూ.. పోలీస్ ఫోర్స్(Police force) గొప్పతనాన్ని చూపిస్తుంది. నాగ చైతన్య డాన్స్‌కి తగ్గట్టుగా జానీ(Jani Master) మాస్టర్ మంచి కొరియోగ్రఫీ చేశాడు.
ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడిగా కృతిశెట్టి(Krithi Shetty) నటిస్తోంది. సపోర్టింగ్ యాక్టర్లుగా అరవింద్ స్వామి, ప్రియమణి, ఆర్.శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ అమరేన్తోపాటు ప్రేమి విశ్వనాథ్ నటించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా ఎస్ఆర్ కార్తిక్, ప్రొడక్షన్ డిజైనర్‌గా రాజీవ్, ఆర్ట్ డైరెక్టర్‌గా డీవై సత్యనారాయణ పని చేస్తున్నారు.
ఈ ఏడాది రిలీజ్ అవుతున్న సినిమాల్లో మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఏదైనా ఉందంటే అది కాస్టడీ((Custody) సినిమానే. రీసెంట్ రిలీజ్ అయిన టీజర్‌కు ఆడియన్స నుంచి సాలిడ్ రెస్పాన్స్ ఒచ్చింది. అయితే ఇప్పుడు ఫస్ట్ సింగిల్ హెడ్ అప్ హై విడుదలతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సాంగ్‌లోని ఎనర్జిటిక్ బీట్స్, పవర్ఫుల్ లిరిక్స్ లిజనర్స్ను ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇళయ రాజా ఇంకా ఆయన తనయుడు అందిస్తున్న సౌండ్ ట్రాక్స్ మ్యూజిక్ లవర్స్‌ని ఎంటర్టైన్ చేయనుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా హైలెవెల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తనానికి కస్టడీ సినిమా హిట్ కొట్టడానికి అన్ని ఎలిమెంట్స్ సరిపడా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇక ఈ చిత్రం 2023 మే 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటు తెలుగు ఆడియన్స్ అంటూ తమిళ్ ఆడియన్స్ నాగ చైనత్య సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.