Kartika Engagement : సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న కార్తీక
ఒకప్పటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక (Kartika) కూడా హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించింది. జోష్ (Josh) సినిమాలో నాగ చైతన్యతో కలిసి నటించి తెలుగువారికి దగ్గరయ్యింది. తమిళంతో పాటు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించిన కార్తీకకు రంగం సినిమా ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో ఎన్టీఆర్ నటించిన దమ్ములో హీరోయిన్ అవకాశం దక్కింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. సోషల్ మీడియాలో […]
ఒకప్పటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక (Kartika) కూడా హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించింది. జోష్ (Josh) సినిమాలో నాగ చైతన్యతో కలిసి నటించి తెలుగువారికి దగ్గరయ్యింది. తమిళంతో పాటు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించిన కార్తీకకు రంగం సినిమా ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో ఎన్టీఆర్ నటించిన దమ్ములో హీరోయిన్ అవకాశం దక్కింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కార్తీక రీసెంట్‌గా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఓ వ్యక్తిని కౌగిలించుకున్నట్టుగా ఉంది. నవ్వులు చిందిస్తూ ఉన్న కార్తీక చేతిలో ఓ ఖరీదైన ఉంగరం కనిపిస్తోంది. ఫోటోలో వారిద్దరి ఫేస్ లుక్స్ కంటే ఆ ఉంగారాన్నే ఎక్కువగా హైలెట్ చేస్తూ ఉంది. ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కార్తీక. నెగెటివ్ ఎనర్జీ తమపై పడకూడదనే ఈగల్ ఐ ఎమోజీని జత చేశానంటూ చెప్పుకొచ్చింది. ఆ ఫోటో చూసినవారు కార్తీకకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ అయితే శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. కార్తీక ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నదని కొద్ది రోజుల కిందట వార్తలు వచ్చాయి. అయితే కార్తీక నిశ్చితార్థం గురించి కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆమె నిశ్చితార్థం గురించి ఆ వివరాలను అధికారికంగా త్వరలోనే కుటుంబ సభ్యులు తెలుపుతారట!