Naga Chaitanya-Sobhita Dhulipala : నేడు నాగ చైతన్య, శోభితల నిశ్చితార్థం.. అందుకోసమే అభిమానుల వెయిటింగ్..!
నటుడు నాగ చైతన్య, నటి శోభిత దుళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు జరుగుతుందనే వార్త ఇప్పుడు ఇంటర్ నెట్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
నటుడు నాగ చైతన్య, నటి శోభిత దుళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు జరుగుతుందనే వార్త ఇప్పుడు ఇంటర్ నెట్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నటుడు నాగార్జున తనయుడు నాగ చైతన్య తన తండ్రిలాగే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడా అనే ప్రశ్నలను అభిమానులు లేవనెత్తుతున్నారు. మరోపక్క సమంత అభిమానులు సోషల్ మీడియాలో నాగ చైతన్యపై విరుచుకుపడుతున్నారు. సమంతతో నాగ చైతన్య విడిపోవడానికి శోభిత దుళిపాళ్లతో సాన్నిహిత్యం అసలు కారణమా? అని ప్రశ్నిస్తున్నారు.
నటుడు నాగ చైతన్య, శోభిత దుళిపాళ్లల నిశ్చితార్థం ఈ రోజు హైదరాబాద్లోని నాగార్జున నివాసంలో జరుగనుందని.. నిశ్చితార్థం పూర్తయ్యాక నాగార్జుననే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని వైరలయ్యే వార్తల సారాంశం. అలాకాకపోతే.. ఇటీవలే సిద్ధార్థ్, అదితి రావుల నిశ్చితార్థం విషయం లీక్ అయింది. ఆ తరువాత ఇద్దరూ ఆ విషయాన్ని అంగీకరించారు. నిశ్చితార్థమే జరిగితే ఇలా కూడా జరిగే అవకాశం ఉంది. నిశ్చితార్థం ప్రకటన గురించి మాత్రం అక్కినేని అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
ఇదిలావుంటే.. గత కొన్నేళ్లుగా నాగ చైతన్య నటి శోభిత దుళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడని కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అయ్యాయి. ఇద్దరూ ఒకే ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లిన విడివిడి ఫోటోలు కూడా నెట్టింట హల్చల్ చేశాయి. అలాగే విదేశాల్లో ఓ మ్యూజియంలో వీరిద్దరూ ఉన్న ఫోటో కూడా వైరలవడంతో వీరి ప్రేమలో ఉన్నారనే వార్తలకు బలం చేకూరింది. అసలు నిజం ఎవరో ఒకరు బయటకు చెప్పే వరకూ ఈ వార్తలు ఆగేలా లేవు..!