చిరంజీవి రజినీకాంత్ మధ్య గొడవ జరిగిందట.. నాగబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. సూపర్ స్టార్, మెగాస్టార్ మధ్య గొడవేంటి..?

చిరంజీవి రజినీకాంత్ మధ్య గొడవ జరిగిందట.. నాగబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. సూపర్ స్టార్, మెగాస్టార్ మధ్య గొడవేంటి..? ఏవిషయంలో జరిగి ఉంటుంది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో కోస్టార్స్ తో చాలా వరకు మంచి స్నేహాన్నిమెయింటేన్ చేస్తుంటారు స్టార్స్. కొందరి మధ్య మాత్రమే గొడవలు, శత్రుత్వాలు, కోల్డ్ వార్ లు గ్రూప్ ఇజాలు ఇలా ఉంటుంటాయి. అయితే ఎక్కవశాతం స్నేహం మాత్రమే కనిపిస్తుంటుంది. అయితే స్టార్ల మధ్య కూడా గొడవలు మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా మంచు మెగా హీరోల మధ్య వార్.. రాజశేఖర్, చిరంజీవి మధ్య , ఇలా కొంత మంది స్టార్ల మధ్య గొడవలు జరిగాయి.

కొన్ని కోన్ని మర్చిపోయి కామ్ గా హ్యాపీగా ఉన్నారు. అయితే మనం ఎవరం ఊహించని విధంగా చిరంజీవి - రజినీకాంత్ మధ్య కూడా గోడవలు జరిగాయట. అవి ఇప్పుడు కాదు.. అప్పట్లో జరిగాయట. ఈ విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబు ఓ సందర్భంలో వివరించారు. రజినీకాంత్ కు ఒకప్పుడ కోపం ఎక్కువగా ఉండేదట. షూటింగ్ లో కూడా బాగా కోపంగా ఉండేవారట. మీడియాతో కూడా కోపంగా మాట్లాడేవారట.

ఆసమయంలోనే చిరంజీవి , రజీనీకాంత్ కాళీ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్ లో ఇద్దరి మధ్య ఏదో చిన్నవిషయంలో మాట మాట పెరిగిందట. ఇద్దరు అరుసుకున్నారట కూడా. వెంటనే దర్శకుడు కలగజేసుకోవడంతో ఈ వివాదం సర్ధుమణిగిందట. అయితే ఆతరువాత రజీనీకాంత్ హిమాలయాల్లో ఉన్న ఓ బాబా భక్తుడిగా మారడం.. ఆతరువాత ఆయన కోపం ఎటు వెళ్ళిపోయిందో తెలియదన్నారు నాగబాబు.

అంతే కాదు అప్పటి నుంచి రజినీకాంత్ ముఖంలో కోపం చూడలేదట. ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటున్నారుఅనేది అందరికితెలిసిందే. ఇప్పుడు ఈఏజ్ ల్ కూడా సూపర్ స్టార్ అంత స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నారు. ఇక జైలర్ సినిమాలో రజినీకాంత్ తో నటించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు నాగబాబు.

ehatv

ehatv

Next Story