ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ(Kalki 2898 Ad) సినిమా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ దూసుకుపోతున్నది
ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ(Kalki 2898 Ad) సినిమా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ దూసుకుపోతున్నది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో 900 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని చిత్ర బృందం చెబుతోంది. కల్కి మానియా ఇలాగే కొనసాగితే మాత్రం రేపో ఎల్లుండో వెయ్యి కోట్ల రూపాయల మార్కును దాటడం ఖాయం. వెయ్యి కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన చిత్రాలు ఇంతకు ముందు ఆరే ఉన్నాయి. ఇప్పుడు ఏడో చిత్రంగా కల్కి నిలవబోతున్నది. ఉత్తరభారతంలో కూడా కల్కి ప్రభంజనం సృష్టిస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. అలాగే నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఏ సౌతిండియన్ మూవీ సాధించని అరుదైన రికార్డును కల్కి సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 16 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. బుక్‌మై షోలో(Book My show) కోటికి పైగా టికెట్ల అమ్మకాలు జరిగిన సినిమాగా కల్కి రికార్డు నెలకొల్పింది. హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో(AMB cinemas) అతి తక్కువ సమయంలోనే మూడు కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది చరిత్ర సృష్టించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన సినిమాలలో మొదటి స్థానం దంగల్ సినిమాది! 2016లో వచ్చిన ఈ సినిమా 2,024 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 2017లో వచ్చిన బాహుబలి -2 సినిమా 1810 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. 2022లో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ 1387 కోట్లు, అదే ఏడాది రిలీజైన కేజీఎఫ్ 2 సినిమా 1,250 కోట్ల రూపాయలు, 2023లో వచ్చిన జవాన్ సినిమా 1,148 కోట్ల రూపాయలు, లాస్టియర్ వచ్చిన పఠాన్ సినిమా 1,050 కోట్ల రూపాయలు వసూలు చేశాయి.