ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ప్రాజెక్ట్ కే' టైటిల్ రివీల్ అయింది. యూఎస్‌లో జరుగుతున్న శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)లో అభిమానుల కోలాహలం మధ్య టైటిల్ ప్రకటించబడింది. సినిమా పేరుతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేశారు. సినిమా టైటిల్‌ 'కల్కి 2898 AD'. దీంతో 'ప్రాజెక్ట్ K' అప్‌డేట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల‌కు..

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ప్రాజెక్ట్ కే' టైటిల్ రివీల్ అయింది. యూఎస్‌లో జరుగుతున్న శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)లో అభిమానుల కోలాహలం మధ్య టైటిల్ ప్రకటించబడింది. సినిమా పేరుతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేశారు. సినిమా టైటిల్‌ 'కల్కి 2898 AD'. దీంతో 'ప్రాజెక్ట్ K' అప్‌డేట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల‌కు ఒకేసారి ట్రీట్ ఇచ్చాడు ప్ర‌భాస్‌. శుక్రవారం ఉదయం భారత్‌లోనూ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం టైటిల్, టీజర్‌ను కామిక్ కాన్‌లో ప్రభాస్, కమల్ హాసన్, దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు.

ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుందని 'కల్కి' టీజర్‌లో చెప్పారు. ఆ శక్తిగా ప్రభాస్‌ను చూపించారు. హీరోయిన్‌ దీపికా పదుకోన్ కూడా ట్రైల‌ర్‌లో మెరిసింది. 'వాటీజ్‌ ప్రాజెక్ట్ కే' అనే ఒకే ఒక్క డైలాగ్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. విజువల్స్ మాత్రం అందరినీ కట్టిపడేసేలా ఉన్నాయి. ప్రభాస్‌ లుక్‌ కూడా అదిరిందని ఫ్యాన్స్‌ చెబుతున్నారు. ప్రపంచమంతా తనను దేవుడిగా కొలవాలని, ప్రజలను బానిసలుగా చేసిన దుష్టశక్తిని ఎదిరించిన యోధుడిగా ప్రభాస్ వీరోచిత పోరాటం చేయనున్నాడ‌ని తెలుస్తోంది.

Updated On 20 July 2023 9:44 PM GMT
Yagnik

Yagnik

Next Story