ఇస్మార్ట్ శంకర్‌(Ismart Shankar) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి నభా నటేశ్‌(Nabha natesh) రోడ్డు ప్రమాదంలో గాయపడి కొంతకాలంగా చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నభా నటేశ్‌కు నటుడు ప్రియదర్శికి(Priyadarshi) మధ్య జరిగిన సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇస్మార్ట్ శంకర్‌(Ismart Shankar) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి నభా నటేశ్‌(Nabha natesh) రోడ్డు ప్రమాదంలో గాయపడి కొంతకాలంగా చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నభా నటేశ్‌కు నటుడు ప్రియదర్శికి(Priyadarshi) మధ్య జరిగిన సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రియదర్శిని క్లాస్‌ పీకింది నభా నటేశ్‌. మాటలు జాగ్రత్త అని ప్రియదర్శిని హెచ్చరించారు. అసలేం జరిగిందంటే.. 'హాయ్‌ డార్లంగ్స్‌ ఎలా ఉన్నారు? అంటూ నభా నటేశ్‌ ఓ సరదా వీడియోను షేర్‌ చేశారు. ప్రభాస్‌(Prabhas) వాయిస్‌తోనే మొత్తం వీడియోను రూపొందించారు. ఈ వీడియో చాలా మందికి నచ్చింది. కామెంట్లు కూడా పెట్టారు. దీనిపై మన ప్రియదర్శి కూడా రియాక్టయ్యారు. వావ్‌ సూపర్‌ డార్లింగ్‌.. కిర్రాక్‌ ఉన్నావు అంటూ కామెంట్‌ చేశాడు. తనను డార్లింగ్‌ అని పిలవడం నభాకు నచ్చలేనట్టుగా ఉంది.

అందుకే ప్రియదర్శికి ఘాటు రిప్లై ఇచ్చింది. ఐపీసీ సెక్షన్‌ 354ఏ ప్రకారం పరిచయం లేని ఓ మహిళను డార్లింగ్‌(Darling) అని పిలవడం లైంగిక వేధింపుల కిందకు వస్తుంది' అని రాసి ఉన్న ఓ ఇమేజ్‌ను షేర్‌ చేసిది. మిస్టర్‌ కామెంట్‌ చేసే ముందు మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించింది. దానికి ప్రియదర్శి ఘాటుగానే స్పందించాడు. 'మనం పరిచయం లేని వ్యక్తులనే విషయం నాకు తెలియదు. మీరైతే డార్లింగ్‌ అనొచ్చు మేము అంటే మాత్రం సెక్షన్సా? లైట్‌ తీసుకో డార్లింగ్‌' అంటూ మరోసారి ఆమెను రెచ్చగొట్టాడు.‘ఆహా!! హద్దు దాటి ప్రవర్తించకు. చూసుకుందాం’అని నభా రిప్లై ఇచ్చారు.

వీరిద్దరి చాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇది సినిమా ప్రమోషన్‌లో భాగం కావచ్చని అంటున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన నభా నటేశ్‌ నన్న దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యింది. అదిగో, ఇస్మార్ట్‌ శంకర్‌‌, డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్‌, అల్లుడు అదుర్స్‌ వంటి సినిమాల్లో నటించింది. నితిన్‌ హీరోగా నటించిన మ్యాస్ట్రో తర్వాత ఆమె సినిమాల్లో కనిపించలేదు. వెండితెరకు దూరంగా ఉండటంపై లాస్టియర్‌ ఓ లేఖను విడుదల చేసింది. 'కొన్నాళ్లు నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మీకు తెలిసిందే! 2022లో నేను రోడ్డు ప్రమాదానికి గురయ్యాను. దాని వల్ల నా ఎడమ భుజానికి గాయమైంది. చాలా సర్జరీలు చేయాల్సి వచ్చింది. మానసికంగా, శరీరకంగా భరించలేని బాధను అనుభవించాను. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. మళ్లీ సినిమాలతో మిమ్మల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాను' అని నభా నటేశ్‌ పేర్కొన్నారు.

Updated On 18 April 2024 1:33 AM GMT
Ehatv

Ehatv

Next Story