నభా నటేష్ ఈ ముద్దుగుమ్మ పేరు వినగానే మీకు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ మూవీతోనే ఈ అమ్మడుకి మంచి క్రేజ్ తో పాటు పేరు కూడా ఒచ్చింది. టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది ఈ భామ. ఈ స్మైలీ బ్యూటీ కర్నాటకలోని శ్రీనగెరిలో పుట్టింది.
1995 డిసెంబర్ 11న నభా నటేష్ జన్మించింది. తల్లిదండ్రులు నాగేంద్ర నటేష్, భాగ్యలక్ష్మి నటష్ సొంతూరులోనే జయసిస్ పాఠశాలలో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది ఈ భామ. ఇక ఆ తర్వాత కర్నాటకలోని ఎన్ఎమ్ఏఎమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసింది నభా నటేష్.
గ్రాడ్యూయేషన్ ఇన్ ఇన్ ఫర్మేషన్ పూర్తయ్యాక ఓ ప్రైవేట్ కంపెనీలో సిస్టమ్ ఇంజనీర్ పని చేసింది. ఇదిలా ఉంటే తన 16 ఏళ్ల వయస్సు నుంచే మోడలింగ్ స్టార్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇంట్లో ఈ భామను ముద్దుగా స్మైలీ అని పిలుచుకుంటారట.
2014లో కన్నడలో ఈ సుందరి ఓ షార్ట్ ఫిలింలో కూడా నటించింది. ఆ తర్వాత 2015లో ‘వజ్రకాయ’ అనే కన్నడ మూవీలో సినీ రంగ ప్రవేశం చేసింది. 2017లో వచ్చిన లీ, సాహెబ్ వంటి మూవీస్ లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. కన్నడ సినిమాల తర్వాత తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టిన నభా.. 2018లో సుధీర్ బాబు చిత్రం ‘నన్నుదోచుకుందువటే’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఇక ఆ తర్వాత 2019లో వచ్చిన ‘ ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ. ఆ సినిమాలో నభా నటనకు, అందానికి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో ఓ ముద్ర వేసుకుంది సన్నటి నడుము భామ. 2020లో వచ్చిన ‘సోలో బ్రతుకే సో బెటర్’లో సాయిధరమ్ తేజ సరసన నటించింది. ఆ తర్వాత రవితేజ, నితిన్ లాంటి హీరోలతో నటించి.. ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
అయితే గతేడాది ఈమె ఏ మూవీలో కూడా కనిపించలేదు. ఇటీవల యాక్సడెంట్ గురైన ఆమె ప్రస్తుతం కోలుకుంది. ఇక ఆ తర్వాత దర్శకనిర్మాతల దృష్టి ఆకట్టుకునేందుకు తరచూ తన గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఆమె నడుము అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తుంది ఈ బ్యూటీ. ఆ మధ్యన సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న నభా నటేష్ మళ్లీ ఇంటెన్సిటీ పెంచింది.
తాజాగా నభా నటేష్ షేర్ చేసిన ఫోజులు కుర్రాళ్ళని ఊరిస్తున్నాయి. పూల వనంలో అందాల దేవతలా నభా నటేష్ ఇస్తున్న ఫోజులు యువతకి మంచి కిక్కు ఇస్తున్నాయి. హాట్ లుక్స్ లో వైట్ శారీ ధరించిన నభా.. కొంగు చాటున ఉన్న క్లీవేజ్ సొగసుతో విజువల్ ట్రీట్ ఇస్తోంది. మెస్మరైజ్ చేసే విధంగా ఉన్న ఆమె ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి 4.2 మంది ఫాలోవర్లు ఉన్నారు.