Samantha: అతడితో నా బంధం చాలా డిఫరెంట్: సమంత..!

సమంత రీసెంట్‌గా తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది, ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్‌లో ప్రసంగం సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె తన ప్రయాణం గురించి, సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడింది. సమంత తన కెరీర్‌ను "అసాధారణమైన ప్రయాణంగా అభివర్ణించింది. 2010లో ఏ మాయ చేశావే సినిమాతో డెబ్యూ చేసి, తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఈ సినిమాకే ఆమెకు ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డ్ వచ్చింది.

సినిమా ఇండస్ట్రీలో మహిళగా ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి మాట్లాడింది. "ఎన్నో అడ్డంకులు, విమర్శలు ఎదురయ్యాయి, కానీ నా పనితో నన్ను నేను నిరూపించుకున్నా" అని చెప్పింది. సమంత తన కెరీర్‌లో రిస్క్‌తో కూడిన నిర్ణయాలు తీసుకోవడం గురించి ప్రస్తావించింది. పుష్ప సినిమాలో "ఊ అంటావా" ఐటెం సాంగ్, శాకుంతలం వంటి పీరియడ్ డ్రామాలో నటించడం వంటివి వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. "నేను ఎప్పుడూ సేఫ్ ఆడలేదు, కొత్త పాత్రలతో ప్రయోగాలు చేయడమే నాకు సక్సెస్ వచ్చింది" అని ఆమె తెలిపారు. 2021లో నాగ చైతన్యతో విడాకుల తర్వాత, సమంత తన కెరీర్‌పై మరింత దృష్టి పెట్టింది. "నా వ్యక్తిగత జీవితంలో ఏది జరిగినా, నా పని నన్ను ఎప్పుడూ బలంగా నిలబెట్టింది" అని ఆమె చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌పై ఆమై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. ‘‘నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు దర్శకుడు రాహుల్‌ నావెంటే ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు. మా అనుబంధానికి పేరు పెట్టలేను. నా స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్తసంబంధీకుడా అని చెప్పలేను’’ అన్నారు. అభిమానుల గురించి మాట్లాడుతూ.. ‘‘ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం నా అదృష్టం. లక్‌తో పాటు నేను పడిన కష్టమే ఈరోజు ఇంతమంది అభిమానానికి కారణం. దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని కెరీర్‌ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ ఎవరైనా అలా డిసైడ్‌ చేస్తే అది అబద్ధమే అవుతుంది. తెలిసి, తెలియక తీసుకున్న ఎన్నో నిర్ణయాలు కెరీర్‌పై ప్రభావం చూపుతాయి’’

ehatv

ehatv

Next Story