సినిమా రంగంలో వదంతులు ఇట్టే వ్యాపిస్తుంటాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే బాపతుగాళ్లు ఆ ఫీల్డ్‌లోనే ఎక్కువగా ఉంటారు. ఏదో ఒక పుకారు పుట్టించి సరదా పడుతుంటారు. ఇప్పుడు ప్రిన్స్‌ మహేశ్‌బాబు(Mahesh Babu)- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో గుంటూరు కారం(Guntur Karam) అనే సినిమా రూపొందుతున్నది కదా! ఈ సినిమాకు థమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు కదా!

సినిమా రంగంలో వదంతులు ఇట్టే వ్యాపిస్తుంటాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే బాపతుగాళ్లు ఆ ఫీల్డ్‌లోనే ఎక్కువగా ఉంటారు. ఏదో ఒక పుకారు పుట్టించి సరదా పడుతుంటారు. ఇప్పుడు ప్రిన్స్‌ మహేశ్‌బాబు(Mahesh Babu)- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో గుంటూరు కారం(Guntur Karam) అనే సినిమా రూపొందుతున్నది కదా! ఈ సినిమాకు థమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు కదా! సడన్‌గా ఆ సినిమా నుంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ను(Thaman) తొలగించారన్న ప్రచారం టాలీవుడ్‌లో జోరుగా జరుగుతోంది. రెండు రోజులుగా ఇదే చర్చ.. సోషల్‌ మీడియాలో ఇదే వైరల్‌గా మారింది.

అంతే కాకుండా మహేశ్‌బాబుతో థమన్‌కు విభేదాలు వచ్చాయని, అందుకే త్రివిక్రమ్‌(Trivikram) ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వదంతులపై థమన్‌ స్పందించారు. ఓ షాకింగ్‌ ట్వీట్‌తో ఇలాంటి పుకార్లను పుట్టించేవారికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ' నా స్టూడియో దగ్గర ఒక మజ్జిగ స్టాల్‌ను ప్రారంభిస్తున్నాను. ఎవరైనా కడుపు మంట లక్షణాలతో బాధపడుతుంటే.. వారందరికి స్వాగతం. కనీసం దీనితోనైనా కోలుకుంటారు. దయచేసి న సమయాన్ని వృధా చేయకండి.

నాకు చాలా పనులు ఉన్నాయి. గుడ్‌నైట్‌' అని ట్వీట్ చేశారు థమన్‌. సాధారణంగా ట్రోల్స్‌పై(trolls) సెలబ్రిటీలు ఎవరూ పెద్దగా స్పందించరు. కానీ థమన్‌ మాత్రం తనపై జరిగే ట్రోల్స్‌కు సమాధానం చెబుతుంటారు. ఒక్కోసారి ఘాటైన రిప్లైలు కూడా ఇస్తుంటారు. థమన్‌ ఇచ్చే కౌంటర్స్‌ మామూలుగా ఉండవు. లేటెస్ట్‌గా థమన్‌ చేసిన ట్వీట్‌ చాలా మందికి అర్థం కాలేదు. బహుశా వారికి అసలు విషయం తెలియకపోవచ్చు. అందుకే ఏమైంది అన్నా అని థమన్‌ను అడుగుతున్నారు. వదంతి గురించి తెలిసిన వారు మాత్రం మహేశ్‌బాబు సినిమా మేకర్స్‌ దీనిపై రియాక్టయితే బాగుంటుందని కామెంట్‌ చేస్తున్నారు.

Updated On 20 Jun 2023 1:34 AM GMT
Ehatv

Ehatv

Next Story