మహేశ్‌బాబు(Mahesh babu) హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) దర్శకత్వంలో సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న గుంటూరుకారం నుంచి ఓ మాస్ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. పాట గురించి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో ఏమోగానీ సినీ అభిమానులు మాత్రం నొచ్చుకుంటున్నారు. పచ్చి బూతు పదాన్ని పాటలో జొప్పిస్తే ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న మహేశ్‌బాబు ఎలా ఒప్పుకున్నాడని చర్చించుకుంటున్నారు.
మహేశ్‌బాబు(Mahesh babu) హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) దర్శకత్వంలో సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న గుంటూరుకారం నుంచి ఓ మాస్ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. పాట గురించి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో ఏమోగానీ సినీ అభిమానులు మాత్రం నొచ్చుకుంటున్నారు. పచ్చి బూతు పదాన్ని పాటలో జొప్పిస్తే ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న మహేశ్‌బాబు ఎలా ఒప్పుకున్నాడని చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో కుర్చీ మడతపెట్టి పదాన్ని పుట్టించిన తాత గురించి కూడా చర్చించుకుంటున్నారు.
కుర్చీ మడతపెట్టి అంటూ సాగే ఆ పాటలో మహేశ్‌బాబు, శ్రీలీల(Sreeleela) స్టెప్పులు అదిరిపోయాయి కానీ సాహిత్యంపైనే చాలా మంది పెదవి విరుస్తున్నారు. హైదరాబాద్‌లో కాలా పాషా అనే పెద్దమనిషి ఉన్నాడు. గతంలో ఓ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితం గురించి చెబుతూ కుర్చీ మడతపెట్టి అంటూ ఓ బూతుపదాన్ని వాడాడు. అది సోషల్ మీడియాలో బాగా పాపులరయ్యింది. అతడు కుర్చీ తాతగా(Kurchi Thatha) ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు అతడి మాటను తమన్ తన పాటకు పెట్టకున్నాడు. ఇందుకోసం కుర్చీ తాతకు దాదాపు అయిదువేల రూపాయలు ఇచ్చాడు తమన్(Thaman). ఈ విషయాన్ని స్వయంగా సదరు ముసలాయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.