మిడ్ ఎయిటీస్‌లో సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి(Raj-Koti) క్రియేట్ చేసిన మ్యూజిక్ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ జోడి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను అందించింది. ఆదివారం రాజ్(Raj) గుండెపోటుతో చనిపోయారు. ఈ వార్త విన్న ఆయన సహచరుడు కోటి(Koti) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
మిడ్ ఎయిటీస్‌లో సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి(Raj-Koti) క్రియేట్ చేసిన మ్యూజిక్ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ జోడి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను అందించింది. ఆదివారం రాజ్(Raj) గుండెపోటుతో చనిపోయారు. ఈ వార్త విన్న ఆయన సహచరుడు కోటి(Koti) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటారని కోటి అన్నారు. రాజ్‌కు తాను ఓ తమ్ముడిలాంటి వాడినని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనతో కలిసి చేసిన ఎన్నో సినిమాలు, వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే ఉంటాయని కోటి తెలిపారు. నా రాజ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని, మొన్నామధ్య ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నామని, అప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నట్టుగా తనకు అనిపించలేదని కోటి చెప్పుకొచ్చారు.
రాజ్ కోటిగా తాము ఎన్నో సినిమాలకు పని చేశామని, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించామని కోటి అన్నారు. తామిద్దం విడిపోయిన తరువాత కోటిగా తాను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారని, తామిద్దరం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లమని కోటి తెలిపారు. 'చక్రవర్తి దగ్గర ఇద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించాం. ఈ రోజు నా రాజ్ లేకపోవడం ఎంతో బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్ కలకాలం ఉంటాడు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల మేం విడిపోయాం. నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ నా పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగాను. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడిని. చిన్ననాటి స్నేహితులం. మేం ఇద్దరం విడిపోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. వద్దురా విడిపోవద్దు అని అన్నాడు. కానీ అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయాం. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటాడు' అంటూ భావోద్వేగానికి గురయ్యారు కోటి.