‘సూపర్ స్టార్’ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణ వంశీ క్లాసిక్ మురారి (2001)ని గ్రాండ్ రీ-రిలీజ్ చేయగా..

‘సూపర్ స్టార్’ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణ వంశీ క్లాసిక్ మురారి (2001)ని గ్రాండ్ రీ-రిలీజ్ చేయగా.. అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. అడ్వాన్స్ బుకింగ్స్‌లో అద్భుతమైన ట్రెండ్‌ను అనుసరించగా.. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ అంతటా పెద్ద సంఖ్యలో షోలు ప్లాన్ చేశారు. ఊహించిన విధంగా.. మురారి 4K బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. మొదటి రోజున ఏకంగా 5.3 కోట్లు వసూలు చేసింది.

ఒక్క నైజాంలోనే.. ఏకంగా 2.9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ 4.4 కోట్లు కాగా, ఓవర్సీస్ లో మొదటి రోజు 55 లక్షలు సొంతం చేసుకుంది. మొత్తం మీద మురారి 4K ప్రపంచవ్యాప్తంగా 5.3 కోట్ల రూపాయల గ్రాస్‌తో భారీ విజయాన్ని సాధించింది. తొలిరోజు INR 5.2 కోట్లు వసూలు చేసిన బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ రికార్డును మహేష్ బద్దలు కొట్టాడు. రీ రిలీజ్ లో రికార్డులు సృష్టించిన సినిమాల లిస్టు ఇదే.. మురారి[5.3 కోట్లు], బిజినెస్ మ్యాన్ [5.2 కోట్లు], ఖుషి [4 కోట్లు], సింహాద్రి [3.5 కోట్లు], జల్సా[3 కోట్లు].

Sreedhar Rao

Sreedhar Rao

Next Story