'బిగ్ బాస్ 17' ట్రోఫీని మునావర్ ఫరూఖీ గెలుచుకున్నాడు. మునావర్ విజయం పట్ల అభిమానులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు.

Munawar Faruqui Wins ‘Big Boss’ Season 17, Takes Home ₹ 50 Lakh, New Car
'బిగ్ బాస్ 17' ట్రోఫీని మునావర్ ఫరూఖీ(Munawar Faruqui) గెలుచుకున్నాడు. మునావర్ విజయం పట్ల అభిమానులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. అదే సమయంలో ట్రోఫీని గెలుచుకున్న తర్వాత మునావర్ ఫరూఖీ స్పందన కూడా వెలుగులోకి వచ్చింది. ట్రోఫీతో పాటు మునావర్ ఫరూఖీ రూ.50 లక్షల ప్రైజ్ మనీ(Prize Money)ని, హ్యుందాయ్ క్రెటాను అందుకున్నాడు.
దాదాపు 105 రోజులు బిగ్ బాస్(Bigg Boss) హౌస్లో గడిపిన తర్వాత టాప్ 5 కంటెస్టెంట్ల ప్రయాణం జనవరి 28న ముగిసింది. మునావర్ ఫరూఖీతో పాటు అంకితా లోఖండే(Ankitha), అభిషేక్ కుమార్(Abhishek Kumar), మనారా చోప్రా(Mannara Chopra), అరుణ్ మాశెట్టి(Arun) కూడా ట్రోఫీ కోసం పోటీ పడ్డారు. వారందరినీ భారీ మెజార్టీతో ఓడించి మునవ్వర్ ఫరూఖీ విజయం సాధించాడు.
"నా విజయానికి నేనే క్రెడిట్ ఇస్తాను. అదేవిధంగా నా అన్ని వైఫల్యాలకు నేనే నిందించుకుంటాను. నా వైఫల్యాలను నేను ఎప్పుడూ అంగీకరిస్తాను. అభిషేక్, మనారా, అంకితతో నా స్నేహం కొనసాగుతుంది. 'లోపల ఏమి జరుగుతుందో అది నా కర్మ వల్లనే జరిగింది, బయట జరిగేది నా కర్మ వల్ల జరుగుతుంది. నాకు లభించిన మద్దతు, ప్రేమ గురించి వారికి తెలుసు. కొన్నిసార్లు స్నేహితుల మధ్య మనస్పర్థలు ఉంటాయి. స్నేహితుల మధ్య పోటీలు తప్పవు. కానీ నిజమైన సంబంధాలు ఇంటి బయట కూడా ఉంటాయని అన్నాడు.
