5 కోట్ల రూపాయలు చెల్లించాలి.
లారెన్స్ బిష్ణోయ్‌తో(Lawrence Bishnoi) శత్రుత్వాన్ని ముగించుకోవలనుకుంటే సల్మాన్ ఖాన్(Salman Khan) రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ ముంబై ట్రాఫిక్ పోలీసుల( Mumbai traffic Police) వాట్సాప్‌కు ఒక సందేశం(Whatsapp message) రావడం కలకలం రేపింది. ఈ మెసేజ్‌ను తేలికగా తీసుకోకండి.. సల్మాన్ ఖాన్ జీవించి ఉండాలనుకుంటే, లారెన్స్ బిష్ణోయ్‌తో శత్రుత్వాన్ని ముగించాలనుకుంటే, అతను 5 కోట్ల రూపాయలు చెల్లించాలి. డబ్బు ఇవ్వకపోతే, సల్మాన్ ఖాన్ పరిస్థితి బాబా సిద్ధిక్(Baba siddique) కంటే అధ్వాన్నంగా ఉంటుందని హెచ్చరించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నారని గుర్తించిన 18 మంది నిందితులు, బిష్ణోయ్ గ్యాంగ్‌లోని ఇతరులపై కేసు నమోదు చేసినట్లు నవీ ముంబై పోలీసులు తెలిపారు. సల్మాన్‌ఖాన్‌ను హతమార్చేందుకు సింగ్‌తో పాటు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు పాకిస్థాన్‌కు చెందిన ఏకే-47, ఎం16, ఏకే92 వంటి ఆయుధాలను ఉపయోగించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
లారెన్స్ బిష్ణోయ్, సంపత్ నెహ్రా గ్యాంగ్‌లు సల్మాన్‌ఖాన్ కదలికలపై రెక్కీ నిర్వహించేందుకు దాదాపు 60 నుంచి 70 మంది సభ్యులను మోహరించినట్లు విచారణలో తేలింది. సల్మాన్ బాంద్రా నివాసం, పన్వెల్ ఫామ్‌హౌస్చ సినిమా షూటింగ్ లొకేషన్‌లలో నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో జనవరి 2024లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించి ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు.