రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. రిలయన్స్ అప్పట్లో ఇన్‏కమింగ్, ఔట్‏గోయింగ్, ఎస్టీడీతోపాటు, నేషనల్ రోమింగ్ కాల్స్ కోసం టారిఫ్‏లను తగ్గించింది. దాంతో ఇప్పుడు ఇన్‏కమింగ్ కాల్స్ పూర్తిగా ఫ్రీగా అయిపోయాయి. అయితే రిలయన్స్ జియో (Reliance Jio ) ఇండియాలో ఇంటర్నెట్ సర్వీసెస్‏లను పూర్తిగా మార్చేసింది.

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. రిలయన్స్ అప్పట్లో ఇన్‏కమింగ్, ఔట్‏గోయింగ్, ఎస్టీడీతోపాటు, నేషనల్ రోమింగ్ కాల్స్ కోసం టారిఫ్‏లను తగ్గించింది. దాంతో ఇప్పుడు ఇన్‏కమింగ్ కాల్స్ పూర్తిగా ఫ్రీగా అయిపోయాయి. అయితే రిలయన్స్ జియో (Reliance Jio ) ఇండియాలో ఇంటర్నెట్ సర్వీసెస్‏లను పూర్తిగా మార్చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా ముఖేష్ అంబానీ తీసుకున్న నిర్ణయం షాకింగ్ వేవ్స్‏ను తీసుకొస్తుంది. పఠాన్ వంటి సినిమా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ప్రస్తుతం మల్టీప్లెక్స్‏ల మీద భారం పడుతోంది. పీవీఆర్(PVR), ఐనాక్స్ (INOX) వంటి మల్టీప్లెక్స్‏లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. కొన్ని చోట్ల పీవీఆర్ థియేటర్లను మూసివేసింది.

జియో ఇప్పుడు ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా ఐపీఎల్ మ్యాచ్‏లను లైవ్ ప్రసారం చేస్తోంది. అయితే జియో సినిమా యాప్ ఇప్పుడు ఒక్క అడుగు ముందుకేసి యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేయకుండానే సినిమాలు, వెబ్ సిరీస్‏లు ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఈ యాప్‏కు లక్షకుపైగా యూజర్లు ఉండటంతో వాళ్లంతా సినిమాలు, సిరీస్‏లు ఫ్రీగా వీక్షిస్తున్నారు. ఇతర ఓటీటీ ప్లాట్‏ఫామ్‏లు డబ్బులు వసూలు చేయకుండా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో ఇప్పుడు జియో సినిమా యాప్ కూడా అదే సర్వీసెస్‏ను ప్రొవైడ్ చేస్తోంది. దీంతో ఈ యాప్‏కి యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. పాత సినిమాలే కాదు.. కొత్త సిరీస్‏లు కూడా ఈ యాప్‏లోకి వచ్చేస్తున్నాయి.

తాజాగా షాహిద్ కపూర్ నటించిన బ్లడీ డాడి(Bloody Daddy), విజయ్ సేతుపతి నటించిన ముంబైకర్ (Mumbaikar) వంటి సినిమాలు ఇప్పుడు జియో సినిమా యాప్ (Jio Cinema App) ద్వారా రిలీజ్ అవనున్నాయి. యాక్చువల్‏గా ఈ సినిమాలు థియేటర్లలో విడుదలవ్వాల్సి ఉండగా.. ఇప్పుడు జియో యాప్ లో విడుదల కాబోతున్నాయి. దీంతో జియో సినిమా యాప్ తమకు ఇబ్బంది కలిగిస్తుందని.. సినిమా ఎగ్జిబిటర్లు భయాందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం జియో సినిమా యాప్ లాభాలను గడించకపోవచ్చేమో కానీ.. థియేటర్ వ్యవస్థపై ఈ యాప్ భారీ ప్రభావాన్ని చూపిస్తోందని చెప్పాలి.

Updated On 26 May 2023 11:58 PM GMT
Ehatv

Ehatv

Next Story