వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌ ముఫాసా- ది లయన్‌ కింగ్‌ ఈ నెల 20వ తేదీన విడుదల కాబోతున్నది.

వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌ ముఫాసా- ది లయన్‌ కింగ్‌ ఈ నెల 20వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాకు బారీ జెంకిన్స్‌ దర్శకుడు. 2019లో వచ్చిన యానిమేటెడ్‌ ఫిల్మ్‌ ది లయన్‌ కింగ్‌కు ఇది కొనసాగింపు. వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌ నిర్మించిన ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన ముఫాసా కు సూపర్ స్టార్ మహేశ్‌బాబు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ముసాఫా: ది లయన్‌ కింగ్‌ కు వాయిస్‌ ఇవ్వడం పట్ల తన ఎక్సయిట్మెంట్‌ని సోషల్‌ మీడియా ద్వారా మహేశ్ బాబు పంచుకున్నారు. ముఫాసా ఇప్పటివరకూ వచ్చిన అత్యంత పాపులర్‌ పాత్రల్లో ఒకటని, తనకు ఇష్టమైన పాత్ర అని చెప్పారు. 'నేను ఎప్పట్నుంచో చూస్తున్న పాత్ర ముఫాసా. తన కుటుంబాన్ని ముఫాసా చూసుకునే తీరు నిజంగా అద్భుతం. ఆ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం గౌరవంగా భావిస్తున్నా. ముఫాసాకు డబ్బింగ్‌ చెప్పడంతో నా కల నెరవేరినట్టయ్యింది.’ అని మహేశ్ బాబు తెలిపారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది.

ehatv

ehatv

Next Story