టీమీండియా(Team India) మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ(MS dhoni) ఉత్తరాఖండ్‌లో సరదాగా గడిపాడు. సాధారణంగా ఖాళీ సమయాన్ని ధోనీ ఎక్కువగా ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తాడు. తాజాగా ఉత్తరాఖండ్‌(Uttarakhand) అల్మోరా(Almora) జిల్లా ల్వాలిలోని తమ పూర్వీకుల(Ancestors) ఇంట్లో సందడి చేశాడు. భార్య సాక్షిసింగ్‌తో(Sakshi singh) కలిసి తమ తాత ముత్తాతల ఇంటిని సందర్శించాడు.

టీమీండియా(Team India) మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ(MS dhoni) ఉత్తరాఖండ్‌లో సరదాగా గడిపాడు. సాధారణంగా ఖాళీ సమయాన్ని ధోనీ ఎక్కువగా ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తాడు. తాజాగా ఉత్తరాఖండ్‌(Uttarakhand) అల్మోరా(Almora) జిల్లా ల్వాలిలోని తమ పూర్వీకుల(Ancestors House) ఇంట్లో సందడి చేశాడు. భార్య సాక్షిసింగ్‌తో(Sakshi singh) కలిసి తమ తాత ముత్తాతల ఇంటిని సందర్శించాడు. ఆ ఇంటి ఎదుట ధోనీ దంపతులు సరదాగా కూర్చోని ఫొటోలు దిగారు. ఆ ఫొటోలతో పాటు ఇంట్లో గడిపిన వీడియోలను సాక్షి సింగ్‌ షేర్‌ చేసింది. 'ఈ ఇంట్లో చాలా మంది ధోనీలున్నారు. అందరు ధోనీలతో అద్భుతమైన రోజు ఈరోజు' అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు ఇప్పటికే లక్షల్లో లైక్స్‌ వచ్చాయి. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. చాలా మంది నెటిజన్లు సాక్షి సింగ్‌కు ధన్యవాదాలు చెప్తున్నారు. 'సాక్షిసింగ్‌'.. ఈ మధ్య కాలంలో ధోనీ ఎక్కడా కనపడడం లేదని.. ధోనీని చాలా రోజుల తర్వాత చూసే అవకాశం వచ్చిందని.. థాంక్యూ సాక్షి అంటూ కామెంట్స్‌ వదులుతున్నారు.

ఇదిలా ఉండగా 2020లో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. టీమిండియా బెస్ట్ కెప్టెన్లలో ధోనీ కీలకంగా వ్యవహరించారు. ధోనీ కెప్టెన్సీలో మూడు ఐసీసీ టోర్నీలను భారత్‌ కైవసం చేసుకుంది. ధోనీ కెప్టెన్సీలో 2007లో టి-20 వరల్డ్‌ కప్‌ గెలవగా..2011లో వరల్డ్‌ కప్‌ కైవసం చేసుకుంది. 2013లో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని ధోనీ కెప్టెన్సీలో భారత్‌ సాధించింది. 2019లో సెమీస్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ఛేజింగ్‌లో ధోనీ రన్‌ ఔట్‌ కావడం, ఇండియా ఓడిపోవడం జరిగింది. దీంతో ఫైనల్‌కు వెళ్లకుండానే భారత్‌ వెనుదిరిగింది. అయితే ధోనీ అప్పుడే రిటైర్‌ అవుదామనుకున్నా...2020లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ ధోనీ కొనసాగుతున్నాడు. 16వ సీజన్‌లో ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది.

Updated On 16 Nov 2023 7:54 AM GMT
Ehatv

Ehatv

Next Story