సీతారామం(Sita Ramam) సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన అందాల భామ మృణాళ్‌ ఠాకూర్‌(Mrunal Thakur). ఆ సినిమా విజయవంతం కావడంలో మృణాళ్‌ పాత్ర కూడా ఉంది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. మోడలింగ్‌ నుంచి సినిమా రంగంలో అడుగుపెట్టిన మృణాళ్‌ ఠాకూర్‌ పలు అడ్వర్‌టైస్‌మెంట్లలో నటించారు. తర్వాత సినిమాల్లోకి వచ్చారు. పలు మరాఠి, హిందీ సినిమాలలో నటించారు.

సీతారామం(Sita Ramam) సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన అందాల భామ మృణాళ్‌ ఠాకూర్‌(Mrunal Thakur). ఆ సినిమా విజయవంతం కావడంలో మృణాళ్‌ పాత్ర కూడా ఉంది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. మోడలింగ్‌ నుంచి సినిమా రంగంలో అడుగుపెట్టిన మృణాళ్‌ ఠాకూర్‌ పలు అడ్వర్‌టైస్‌మెంట్లలో నటించారు. తర్వాత సినిమాల్లోకి వచ్చారు. పలు మరాఠి, హిందీ సినిమాలలో నటించారు. అయినప్పటికీ ఆమెకు పెద్దగా నేమ్‌ ఫేమ్‌ రాలేదు. కానీ సీతారామం అనే తెలుగు సినిమాతో బోల్డంత క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఆ ఒక్క హిట్‌ సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగుతో పాటు దక్షిణాది సినిమాలలో నటిస్తున్న మృణాళ్‌ బిజీగా ఉన్నారు. తెలుగులో నాచురల్ స్టార్‌ నానితో(Nani) కలిసి హాయ్‌ నాన్న(Hi Nana) అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు ఆమెకు కోలీవుడ్‌(Kollywood) నుంచి ఆఫర్లు వస్తున్నాయి.

స్టార్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌ మురుగదాస్‌(AR Murugadoss) కొత్త సినిమాలో శివ కార్తికేయన్‌(Shiva Karthikeyan) కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాళ్‌ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సంగీతాన్ని అనిరుధ్‌(Anirudh) అందిస్తున్నాడు. శివ కార్తికేయన్‌ నటించిన మావీరన్‌(Maveeran) సినిమా ఇటీవలే విడుదయ్యింది. సూపర్‌హిట్టయ్యింది. ప్రస్తుతం కమలహాసన్‌(Kamal Hassan) నిర్మిస్తున్న సినిమాలో కూడా శివకార్తికేయన్‌ నటిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి(Sai pallavi) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత శివ కార్తికేయన్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో సినిమా మొదలు కానుంది. రజనీకాంత్‌తో(Rajinikanth) చేసిన దర్బార్‌(Darbar) సినిమా ఫ్లాప్‌ కావడంతో మురుగదాస్‌ మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు శివ కార్తికేయన్‌తో చేస్తున్నాడు. ఈ ఏడాది చివరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

Updated On 8 Aug 2023 6:12 AM GMT
Ehatv

Ehatv

Next Story